Telugu Global
Health & Life Style

అసలు శ్వాస ఎలా తీసుకోవాలో తెలుసా?

శ్వాస తీసుకునే విధానానికి ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉందని మీకు తెలుసా? శ్వాస తీసుకోవడంలో ఉండే లోపాల వల్లే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

అసలు శ్వాస ఎలా తీసుకోవాలో తెలుసా?
X

శ్వాస తీసుకునే విధానానికి ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉందని మీకు తెలుసా? శ్వాస తీసుకోవడంలో ఉండే లోపాల వల్లే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అసలు శ్వాస సరిగ్గా తీసుకోవడం తెలిస్తే అన్ని మానసిక సమస్యలు మాయమవ్వడంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అసలు శ్వాస ఎలా తీసుకోవాలంటే..

శ్వాస ద్వారానే శరీరానికి ప్రాణ శక్తి అందుతుంది. శ్వాస ద్వారా అందే ఆక్సిజన్ శాతాన్ని బట్టి, రక్త కణాల వృద్ధి, రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె పని తీరు ఆధారపడి ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం మూడు శ్వాస తీసుకునే విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముక్కు ద్వారా శ్వాస

ముక్కు అనేది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. బయట్నుంచి తీసుకునే గాలిని ముక్కు ఫిల్టర్ చేసి ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ముక్కులో ఉండే శ్వాస ఫిల్టర్లు ఎక్కువ ఆక్సిజన్‌ను అబ్జార్బ్ చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు, ముక్కు రంధ్రాల వద్ద ఉండే తడిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది వైరస్‌లను, బ్యాక్టీరియాలను నిరోధించడంలో సాయపడుతుంది. కాబట్టి శ్వాస ఎప్పుడూ ముక్కు ద్వారానే జరగాలి. చాలామంది నిద్రించే సమయంలో నోటి ద్వారా గాలి తీసుకుంటుంటారు. అలా జరగకుండా జాగ్రత్తపడాలి.

చూయింగ్, హమ్మింగ్

నమలడం అనే ప్రక్రియ ముక్కు కండరాలను వ్యాకోచింపజేసి శ్వాస ఆడే విధానాన్ని సరళం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం లేదా అప్పుడప్పుడు చూయింగ్ గమ్ నమలడం వంటివి చేయడం ద్వారా శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే హమ్మింగ్ చేయడం వల్ల కూడా బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు పాటలను హమ్ చేస్తూ ఉండడం కూడా మంచి అలవాటే అన్న మాట.

స్లో బ్రీతింగ్

శ్వాస ఎంత నెమ్మదిగా సాగితే మెదడు అంత ప్రశాంతంగా ఉంటుంది. కోపంగా ఉనప్పుడు, ఒత్తిడి, టెన్షన్స్‌లో ఉన్నప్పుడు శ్వాస పెరగడాన్ని మనం గమనించొచ్చు. శ్వాస వేగానికి మెదడు పనితీరుకి లింక్ ఉందని రీసెంట్ స్టడీలు కూడా చెప్తున్నాయి. అంతేకాదు, శ్వాసను నిదానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, యాంగ్జయిటీల నుంచి తేలిగ్గా బయటపడొచ్చట. కనీసం ఆరు సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం ఆరు సెకన్ల పాటు విడిచిపెట్టడం అలవాటుగా మారితే ఆరోగ్యానికి చాలా మంచిది.

First Published:  13 July 2024 4:55 PM GMT
Next Story