Telugu Global
Health & Life Style

వంటల్లో ఉప్పు ఎంత వాడాలి? ఉప్పుతో ప్రమాదమేనా?

రోజువారీ వంటల్లో ఉప్పు అనేది కీలకమైన పదార్థం. ఇందులో ఉండే అయోడిన్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. కానీ, ఇది కావాల్సినంత మేరకు మాత్రమే తీసుకోవాలి. అయోడిన్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.

వంటల్లో ఉప్పు ఎంత వాడాలి? ఉప్పుతో ప్రమాదమేనా?
X

రోజువారీ వంటల్లో ఉప్పు అనేది కీలకమైన పదార్థం. ఇందులో ఉండే అయోడిన్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. కానీ, ఇది కావాల్సినంత మేరకు మాత్రమే తీసుకోవాలి. అయోడిన్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.

మనిషి శరీరంలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని జబ్బుల చికిత్స, నివారణతో పాటు అవయవాల పనితీరుకి కూడా అయోడిన్ తోడ్పడుతుంది. శరీరంలో అయోడిన్‌ లోపిస్తే పిల్లల్లో ఎదుగుదల లోపించడంతోపాటు పెద్ద వాళ్లలో థైరాయిడ్, మెదడు సమస్యల వంటివి వస్తాయి. అయోడిన్ లోపించడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి అయోడిన్‌ను తగిన పాళ్లలో తీసుకోవడం ఎంతైనా అవసరం.

అయోడిన్‌ శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం, మెదడు పనితీరు, శ్వాస వ్యవస్థ, గుండె వేగం, జీవక్రియ, జీర్ణక్రియ వంటి ఎన్నో పనులను చక్కబెడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ ఎంతో అవసరం. థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. అందుకే అయోడిన్ లోపించినప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తుంటాయి.

నిపుణుల ప్రకారం వయసుని బట్టి అయోడిన్ తీసుకోవాలి. ఆరు నెలల్లోపు పిల్లలకు రోజుకి 110 మైక్రో గ్రాములు, 7 నుంచి 12 నెలల పిల్లలకు రోజుకి 130 మైక్రోగ్రాములు, ఎనిమిది ఏళ్ల లోపు పిల్లలకు 90 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 120 మైక్రోగ్రాములు, టీనేజ్ పిల్లలకు, పెద్దవాళ్లకు 150 మైక్రోగ్రాములు, గర్భిణులకు 220 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు 290 మైక్రోగ్రాముల అయోడిన్ తీసుకోవాలి.

అయోడిన్ కేవలం ఉప్పులో మాత్రమే కాదు, చేపలు, పీతలు, పాలు, గుడ్ల వంటి వాటిలో కూడా లభిస్తుంది. ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు ఉప్పు తక్కువగా వాడుకోవచ్చు. అలాగే అయోడిన్ కలిపిన ఉప్పుకి బదులు సహజంగా దొరికే సీ సాల్ట్, రాక్ సాల్ట్ వంటివి వాడితే ఇంకా మంచిది.

First Published:  11 Jan 2024 6:24 AM GMT
Next Story