Telugu Global
Health & Life Style

హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..

ఒకప్పుడు హోలీకి సహజమైన రంగులు వాడేవారు. కానీ, ఇప్పుడు వాడుతున్న రసాయన రంగులు జుట్టు, చర్మానికి ఇబ్బందులు కలిగిస్తాయి.

హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..
X

రంగుల పండుగ హోలీ దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. కేవలం, బంధువులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అంతా కలిసి ఈ కలర్ ఫుల్ హోలీని ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు చిన్నచిన్న అజాగ్రత్తల కారణంగా హోలీ తరువాత చాలా మంది ఇబ్బందులు పడతారు. కనుక హోలీ పండుగ మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే కలిగించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు హోలీకి సహజమైన రంగులు వాడేవారు. కానీ, ఇప్పుడు వాడుతున్న రసాయన రంగులు జుట్టు, చర్మానికి ఇబ్బందులు కలిగిస్తాయి. పూసుకున్న రంగులు తొందరగా పోవు. అంతేకాదు.. చాలా రకాల స్కిన్ ఎలర్జీలు, ర్యాష్ లు వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి తిప్పలు పడాల్సి ఉంటుంది. అందుకే ముందుగా ఈ చిన్న చిన్నజాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

చర్మ సంరక్షణ కోసం..

మీరు హోలీ ఆడబోతున్నట్లయితే, దానికి ముందు మీ ముఖానికి అలోవెరా జెల్ రాసుకోవచ్చు. దీని వల్ల రంగులు చర్మానికి డైరెక్ట్ గా హాని కలిగించవు. దీనితో పాటు, ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. లేదంటే పెట్రోలియం జెల్లీని కూడా రాసుకోవచ్చు. ఇది కూడా హోలీ రంగులను సులభంగా తొలగిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.హోలీ ఆడే ముందు, మీరు తప్పనిసరిగా మీ ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది మీ ముఖంపై రక్షణ పొరను సృష్టిస్తుంది. దీనితో పాటు, హోలీ రంగులు చర్మానికి ఎటువంటి హాని కలిగించవు. అలాగే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మంపై సన్‌స్క్రీన్ కూడా రాయండి. దీని వల్ల సూర్యరశ్మి నుండి రక్షణ ఉంటుంది మరియు చర్మ సమస్య ఉండదు. చర్మాన్ని రంగుల నుండి రక్షించుకోవడానికి ఫుల్ స్లీవ్ దుస్తులను మాత్రమే ధరించి బయటకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల చర్మం రంగుల నుండి రక్షించబడుతుంది.

జుట్టుకు ఇలా చేయండి..

హోలీ రంగులను నీటిలో కలిపి చల్లుకునేవారే ఎక్కువ. దీనివల్ల మీ జుట్టు పొడిగా,పెళుసుగా మారుతుంది. జుట్టును సంరక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. రంగులతో ఆడుకునే ముందు మీ జుట్టుకు కొబ్బరి నూనెను పట్టించడం వల్ల మీ జుట్టును రంగులలో ఉండే కఠినమైన రసాయనాలు పూర్తిగా పాడు చెయ్యలేవు. అలాగే ఎంత తక్కువ రంగు వాడినా రంగులు చల్లుకున్న వెంటనే తలకు స్నానం చేయాలి. రంగులు చల్లకోవడానికి ముందు జుట్టును గట్టిగా ముడి వేసుకోండి. లూజ్ గా జుట్టును వదిలేయడం వల్ల రంగులు మాడు వరకు అంటుకునే అవకాశం ఉంది. తలకు టోపీ లేదా స్కార్ఫ్ వంటివి పెట్టుకోవటం ఇంకా మంచిది. రంగులను శుభ్రంగా తొలగించటం కోసం అసలు వేడి నీటిని ఉపయోగించకూడదు. ఇది మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. హెయిర్ వాష్ కోసం చన్నీటిని, తేలికపాటి , సల్ఫేట్ లేని షాంపూను ఉపయోగించాలి.

First Published:  23 March 2024 7:53 AM GMT
Next Story