Telugu Global
Health & Life Style

ముడతలు లేని చర్మం కోసం వర్కవుట్స్ ఇలా

ముడతలు లేని చర్మాన్ని కోరుకునేవాళ్లు అలాగే జిమ్‌లో ఎక్కువగా కుస్తీ పడేవాళ్లు స్కిన్ టైటెనింగ్ కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

ముడతలు లేని చర్మం కోసం వర్కవుట్స్ ఇలా
X

శరీరం ఎంత ఫిట్‌గా ఉన్నా చర్మం వదులుగా వేలాడుతూ ఉంటే.. ఫిట్‌గా ఉండి ప్రయోజనం లేదు. అందుకే బాడీ ఫిట్‌నెస్‌తో పాటు స్కిన్ మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. స్కిన్ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి వర్కవుట్స్ చేయాలంటే..

ముడతలు లేని చర్మాన్ని కోరుకునేవాళ్లు అలాగే జిమ్‌లో ఎక్కువగా కుస్తీ పడేవాళ్లు స్కిన్ టైటెనింగ్ కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాంక్

ప్లాంక్ వ్యాయామం అందరికీ తెలిసింది. ఈ ఒక్క వ్యాయామంతో కోర్ బాడీ అంతా ఫిట్‌గా మారుతుంది. పొట్ట దగ్గరి చర్మం బిగుతుగా మారుతుంది. పొట్ట దగ్గర వదులైన చర్మం ఉన్నవాళ్లు రోజుకో రెండు నిముషాలు ప్లాంక్ చేస్తే మంచిది.

సైడ్ ప్లాంక్

పక్కకు తిరిగి ప్లాంక్ చేయడాన్నే సైడ్ ప్లాంక్ అంటారు. ముందుగా నేలపై ఒక పక్కకు పడుకుని, మోచేతిని నేలకు అదిమి పెట్టి శరీరాన్నంతా పైకి లేపాలి. తల నుంచి పాదాల వరకూ ఒకటే స్ట్రైట్‌లైన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ వర్కవుట్ వల్ల పొట్టకు ఇరువైపులా ఉండే చర్మం కూడా బిగుతుగా మారుతుంది.

కోబ్రా పోజ్

నేలపై బోర్లా పడుకుని రెండు చేతులను చెస్ట్ కు సమాంతరంగా ఉంచాలి. తర్వాత అప్పర్ బాడీని మెల్లగా పైకి లేపాలి. దీన్నే భుజంగాసనం అని కూడా అంటారు. ఈ పోజ్‌లో కాసేపు ఉండడం వల్ల అప్పర్ బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.

వెయిటెడ్ స్క్వాట్

చేతుల్లో కొంత బరువును పట్టుకుని గాలిలో గోడ కుర్చీ వేసినట్టుగా కిందకు వంగాలి. ఇలా చేసేటప్పుడు మోకాళ్లు తొంబై డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ పొజిషన్‌లో ముప్పై సెకన్ల నుంచి ఒక నిముషం వరకూ ఉండొచ్చు. దీనివల్ల పొట్ట, కాళ్లు, తొడ భాగాల్లోని చర్మం బిగుతుగా తయారవుతుంది.

జాగ్రత్తలు ఇలా..

చర్మం హెల్దీగా, బిగుతుగా ఉండాలనుకునేవాళ్లు వర్కవుట్‌కు ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మంపై కాస్మొటిక్స్ వంటివి ఉంటే ఆ చెమట బయటకు రాకుండా చర్మంలోనే ఉండిపోతుంది. కాబట్టి వర్కవుట్స్‌కు ముందు చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వర్కవుట్స్ తర్వాత కూడా చర్మాన్ని నీట్‌గా శుభ్రం చేసుకోవాలి.

చర్మం అందంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. శరీరానికి సరిపడా నిద్రపోకపోతే దాని ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకే రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.

రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వాటిలో స్ట్రెచింగ్, యోగా లాంటివి కొన్నైనా ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం మూడురోజులు వర్కవుట్స్‌ చేయాలి.

First Published:  10 Aug 2024 3:15 AM GMT
Next Story