Telugu Global
Health & Life Style

వ్యాయామం చేయకుండా ఫిట్‌గా ఉండాలంటే

రోజువారీ వ్యాయామం చేయడం కుదరని వారు.. లైఫ్‌స్టైల్‌లో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు.

Health Tips: how to get fit without exercise
X

వ్యాయామం చేయకుండా ఫిట్‌గా ఉండాలంటే

బిజీ లైఫ్‌స్టైల్, పనుల్లో ఒత్తిడి కారణంగా చాలామందికి వర్కవుట్స్ చేయడం కుదరకపోవచ్చు. మరి ఇలాంటప్పుడు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం ఎలా?

రోజువారీ వ్యాయామం చేయడం కుదరని వారు.. లైఫ్‌స్టైల్‌లో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. అదెలాగంటే..

వర్కవుట్స్ చేయలేని వాళ్లు చల్లని నీరు తాగే బదులు గోరువెచ్చని నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.

తీసుకునే ఆహారంలో పంచదారను అవాయిడ్ చేయాలి. చక్కెర వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే పంచదారకు బదులు బెల్లం, తేనె వంటివి ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు.

వ్యాయామం చేయలేకపోయినా.. కేవలం నడవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. ఇల్లు, ఆఫీసులో అటు ఇటు నడుస్తూ రోజుకు కనీసం మూడు నుంచి ఐదు వేల అడుగులు నడిచేలా చూసుకోవాలి.

ఫ్రూట్స్‌తో జ్యూస్ చేసుకుని తాగే బదులు డైరెక్ట్‌గా ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి మరికొన్ని ఇతర పోషకాలు, ఫైబర్‌ అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

యాక్టివ్ లైఫ్ స్టైల్ లేనివాళ్లు ప్రతి రోజు ఒకే టైంకి తినడం , తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోవడం వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది.

వీటితో పాటు తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ కంటే ప్రొటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే రోజుకు కనీసం 6 నుంచి -8 గంటల నిద్ర పోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

First Published:  24 May 2023 10:05 AM GMT
Next Story