Telugu Global
Health & Life Style

ఉదయాన్నే బ్రష్ చేసే ముందే నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది సెలెబ్రిటీలు ఖరీదైన నీళ్లు తాగుతుంటారు. మనకు అంత స్థోమత లేకపోయినా శుభ్రమైన నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఉదయాన్నే బ్రష్ చేసే ముందే నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
X

నీళ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బాడీ మెటబాలిజం సరిగా ఉండాలంటే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలని అందరూ చెప్తుంటారు. చాలా మంది ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీళ్లు తాగుతారు. కొంత మంది చల్లని నీరు తాగుతారు. ఇక అన్నం తిన్న తర్వాత లీటరు నీళ్లు తాగే వారు కూడా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేయకుండా మంచినీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది సెలెబ్రిటీలు ఖరీదైన నీళ్లు తాగుతుంటారు. మనకు అంత స్థోమత లేకపోయినా శుభ్రమైన నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రష్ చేసే ముందే నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలా నీరు తాగడం వల్ల నోటిలోని లాలాజలం కడుపులోనికి వెళ్లి హానికారిక బ్యాక్టీరియాను చంపుతుంది. తద్వారా పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.

పాచి నోటితో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడం సులువు అవుతుంది. పాచి నోటితో గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. చల్లని నీటి కంటే గోరు వెచ్చని నీరు ఎక్కువ మేలు చేస్తుంది. అంతే కాకుండా కిడ్నీల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మూత్రపిండాల్లో చేరడం వంటి సమస్యలతో పాటు దానికి సంబంధించిన ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.

పొద్దున్నే నీళ్లు తాగడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని టాక్సిన్లు విడుదల అవడం వల్ల మెటిమల సమస్యను కూడా అధిగమించవచ్చు. అంతే కాకుండా క్రమం తప్పకుండా పాచి నోటితో నీళ్లు తాగే వారి మొఖంలో మెరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే నీళ్లు తాగే వారిలో జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. కడుపులోకి లాలాజలం చేరడం ద్వారా జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో కడుపులో మలినాలు బటయకు వెళ్తాయి. గట్ హెల్త్ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story