Telugu Global
Health & Life Style

నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఇవి తినండి

శీతాకాలంలో చాలా మందిలో నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి ఇలా ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది.

నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఇవి తినండి
X

శీతాకాలంలో చాలా మందిలో నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి ఇలా ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, రాంగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల ప్రజల్లో నడుము నొప్పి సమస్య పెరుగుతోంది. అంతే కాకుండా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరంలో పోషకాల కొరత కూడా ఇందుకు కొన్ని కారణాలే. ఒకవేళ మీరు తరచూ వెన్నునొప్పితో బాధపడుతుంటే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

అందుకోసం మీరు బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు మరియు చేపలను తీసుకోవాలి. ఇది కాకుండా, వంట కోసం ఆవాల నూనె , ఆయిల్ వాడటం కూడా నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కూడా నొప్పిని తగ్గించడంలో మీకు చాలా సహాయపడతాయి. దాల్చినచెక్క, ఎర్ర మిరపకాయ మరియు అల్లం వంటి అనేక మసాలా దినుసులు, పసుపు వంటివి కూడా కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒక్కోసారి శరీరంలో ప్రొటీన్ లోపించడం వల్ల కొన్నిసార్లు నొప్పి సమస్య తలెత్తుతుంది. అందువల్ల, మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని గుడ్లు, పాలు, పప్పులు మొదలైనవి చేర్చుకోవాలి. అంతే కాదు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కాలీఫ్లవర్, బ్రోకలీ, బచ్చలికూర, క్యాబేజీ మొదలైన వాటిని తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ కె కూడా ఉంటాయి.

బీట్‌రూట్, క్యారెట్ మరియు గుమ్మడికాయ మొదలైన రూట్ వెజిటేబుల్స్‌ని కూడా తీసుకోవచ్చు. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. నొప్పి నుండి ఉపశమనం పొందడం కోసమనే కాదు మొత్తం ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాజా పండ్లను కూడా తీసుకోవాలి. సీజన్ ని బట్టి ఆహారంలో పైనాపిల్, యాపిల్, చెర్రీ, బ్లాక్‌బెర్రీస్, సిట్రస్ పండ్లు మరియు ద్రాక్ష మొదలైన వాటిని చేర్చుకోవాలి . అంతే కాదు నడుము నొప్పితో బాధపడేవారు ప్రతి రోజు వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

First Published:  11 Dec 2023 6:00 AM GMT
Next Story