Telugu Global
Health & Life Style

బీపీలో హెచ్చుతగ్గులుంటే..

హై బీపీ లేదా లో బీపీ సమస్యతో బాధ పడుతున్నవాళ్లు ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Fluctuating blood pressure: బీపీలో హెచ్చుతగ్గులుంటే..
X

Fluctuating blood pressure: బీపీలో హెచ్చుతగ్గులుంటే..

సాధారణంగా రక్తపోటు అనేది రోజంతా ఒకేలా ఉండదు. శారీరక శ్రమ చేసినప్పుడు పెరగుతూ.. మిగిలిన సమయాల్లో తగ్గుతుంటుంది. రక్తపోటులో ఇలాంటి మార్పులు సహజమే. అయితే హై బీపీ లేదా లో బీపీ సమస్యతో బాధ పడుతున్నవాళ్లు ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సాధారణంగా బీపీ 120/80 ఉండాలి. దాని పై సంఖ్యకు 20, కింది సంఖ్యకు 10 పెరుగుతూ.. 140/90, 160/100, 180/110, 200/120.. ఇలా రక్తపోటు మారుతూ ఉంటే ప్రమాదంగా గుర్తించాలి.

పై సంఖ్య 200కు మించితే రక్తనాళాలు చిట్లే ప్రమాదముంది. అలాగే కింది సంఖ్య పెరుగుతూ వస్తున్న కొద్దీ గుండె మీద భారం పెరుగుతూ వస్తుంది. ఇది గుండెపోటుకి దారితీయొచ్చు. కాబట్టి కాబట్టి అలాంటి సమయాల్లో వెంటనే డాక్టర్‌‌ను కలవాలి.

రక్తపోటులో తరచూ హెచ్చుతగ్గులు గమనిస్తున్నట్టయితే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి బీపీలో మార్పులకు కారణమేంటో తెలుసుకోవడం మంచిది.

బీపీ సమస్య ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేయకూడదు. ఒత్తిడి, కోపం, నిద్రలేమి, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఉన్నట్టుండి రక్తపోటులో మార్పులు రావడం వల్ల ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం, పక్షవాతం, గుండెపోటు లాంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి బీపీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

First Published:  29 May 2023 12:29 PM GMT
Next Story