Telugu Global
Health & Life Style

గోళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!

మృదువైన, పొడవాటి గోళ్లు ఉండాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే అందమైన గోళ్లను పెంచడం అంత ఈజీ కాదు. దానికోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

గోళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
X

గోళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!

మృదువైన, పొడవాటి గోళ్లు ఉండాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే అందమైన గోళ్లను పెంచడం అంత ఈజీ కాదు. దానికోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

గోళ్లు అందంగా ఉంటేనే చేతులు అందంగా కనిపిస్తాయి. అయితే ముందుగా గోళ్లు పొడవుగా పెరగడానికి శరీరంలో విటమిన్–ఇ సరైన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్–ఇ లోపం ఉంటే గోళ్లు కొద్దిగా పెరగగానే పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. లేదా అసలే పెరగవు. కాబట్టి గోళ్లు అందంగా ఉండాలనుకునేవాళ్లు విటిమిన్–ఇ ఎక్కువగా ఉండే బాదం పప్పులు, సన్‌ఫ్లవర్ సీడ్స్, బ్రోకలీ, పాలకూర వంటివి తినాలి.

గోళ్లు సున్నితంగా, మృదువుగా ఉండడం కోసం గోళ్లకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను గోళ్లమీద రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే గోళ్లు త్వరగా పెరగడమే కాకుండా గోళ్లు మృదువుగా ఉంటాయి.

గోళ్లు కాస్త పెరగగానే విరిగిపోతుంటే వాటికి వెల్లుల్లి రసం, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయాలి. దాన్ని గోళ్లపై రాసి ఐదు నిముషాలు మర్దన చేసి కడిగేయాలి. కేవలం వెల్లుల్లి రెబ్బలను రుద్దినా ఫలితం ఉంటుంది.

గోళ్లు తెల్లగా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించాలంటే గోళ్లపై ఆరెంజ్ జ్యూస్ లేదా ఆరెంజ్ తొక్కల మిశ్రమాన్ని రాసి మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. అలాగే గోళ్ల అందం కోసం గోళ్లలో ఉండేమట్టిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి.

ఇకపోతే గోళ్లు అందంగా కనిపించేందుకు నెయిల్ పాలిష్ వాడుతుంటారు చాలామంది. అయితే నెయిల్ పాలిష్‌లు ఎంచుకునేటప్పుడు కెమికల్స్ తక్కువగా ఉండే మేలిరకం పాలిష్ లు ఎంచుకోవాలి. నాసిరకం నెయిల్ పాలిష్‌లు వాడడం వల్ల గోళ్ల సహజమైన లేత గులాబీ రంగు కాస్తా పసుపు పచ్చగా మారిపోతుంది. అలాగే నిర్ణీత సమయానికి పాలిష్ రిమూవ్ చేస్తుండాలి.

First Published:  6 Sep 2023 6:00 AM GMT
Next Story