Telugu Global
Health & Life Style

అందమైన కళ్ల కోసం ఐ మేకప్ టిప్స్!

కళ్ల అందం కోసం చాలామంది ఐలైనర్, మస్కారా, ఐల్యాషెస్ లాంటి మేకప్‌ వాడుతుంటారు.

అందమైన కళ్ల కోసం ఐ మేకప్ టిప్స్!
X

అందమైన కళ్ల కోసం ఐ మేకప్ టిప్స్!

కళ్ల అందం కోసం చాలామంది ఐలైనర్, మస్కారా, ఐల్యాషెస్ లాంటి మేకప్‌ వాడుతుంటారు. అయితే మేకప్ కారణంగా కళ్లు పాడవకూడదంటే ఐ మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

కంటి మేకప్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కళ్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు. అందుకే రోజూ నిద్రపోయే ముందు ఐ మేకప్ తీసేయాలి. మేకప్ తీయకుండా నిద్రపోవడం వల్ల అందులో ఉండే కెమికల్స్ కంటిలోకి చేరే ప్రమాదముంది.

కంటి మేకప్‌లో వాడే కెమికల్స్ వల్ల కంటి ఇన్ఫెక్షన్లు, కంటి చూపు కోల్పోయే ప్రమాదముంది. అందుకే కంటి మేకప్ కోసం వాడే ప్రొడక్ట్స్ ఎఫ్‌డీఏ అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవాలి.

ఐ లైనర్, ఐ ల్యాషెస్, మస్కారా, ఐ షాడోస్ లాంటి మేకప్స్ వేసుకునేటప్పుడు కనురెప్పలు, కంటి లోపలి భాగానికి మేకప్ అంటకుండా జాగ్రత్తపడాలి. మేకప్ వేసుకున్నాక కంట్లో ఇరిటేషన్ అనిపిస్తే వెంటనే మేకప్ తొలగించాలి. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఐ మేకప్ వేసుకున్నప్పుడు కళ్లను చేతితో తాకకూడదు. అలా చేస్తే కెమికల్స్‌తో పాటు, చేతిపై ఉన్న బ్యాక్టీరియా కూడా కంటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కంటి మేకప్ కోసం ఆర్గానిక్ లేదా సహజమైన ప్రొడక్ట్స్‌ వాడడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఐ మేకప్‌ను తొలగించేందుకు, రోజ్ వాటర్ లేదా కొబ్బరి నూనెను వాడాలి. కంటి మేకప్‌ను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు.

First Published:  12 July 2023 8:19 PM GMT
Next Story