Telugu Global
Health & Life Style

ఆటో ఇమ్యూనిటీ అంటే తెలుసా..

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన హీరోయిన్ సమంత దాని నుంచి క్రమక్రమంగా కోలుకుంటోంది.

ఆటో ఇమ్యూనిటీ అంటే తెలుసా..
X

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన హీరోయిన్ సమంత దాని నుంచి క్రమక్రమంగా కోలుకుంటోంది. మొదట్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత ఏడాది పాటు షూటింగ్​లకు బ్రేక్ ఇచ్చి మరీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టింది.

ఈ నేపథ్యంలో మయోసైటిస్ ఇండియా ఆర్గనైజేషన్ వారు సమంతని మయోసైటిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఈ వ్యాధి పట్ల అవగాహన పెంపొందిస్తూ, వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నియామకం జరిగింది.

అప్పటి నుంచి సమంత తన ట్రీట్మెంట్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇక ఇప్పుడు ఆమె టేక్‌ 20 పేరుతో ఓ హెల్త్‌ పాడ్‌కాస్ట్​ను స్టార్ట్ చేశారు. అందులో చర్చించిన విషయాలలో ఒకటి ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టం.. నిజానికి ఇదొక వ్యాధి కాదు. మన శరీరంలో రోగాలను అడ్డుకునేందుకు ఉండే సహజ వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంపైనే దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఇది చాలా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఎదురయ్యే సమస్య.

అయితే ఇది షుగర్‌, క్యాన్సర్‌, గుండె సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తినే తిండి నుంచి పీచ్చే గాలి, ధరించే దుస్తులు వరకు, ఇంకా చెప్పాలంటే సౌందర్యోపకరణాలు కూడా. ఇలా వీటన్నింటిలో ఏవైనా ఎఫెక్ట్ చూపొచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఆధునిక జీవనశైలి, తీవ్ర ఒత్తిడి దీనికి ప్రధాన కారణం.

ఒత్తిడిని జయించేందుకు శరీరానికి మంచి నిద్ర అవసరం. సరిగా నిద్రించకపోవడం వల్ల తాత్కాలికంగా ప్రభావం కనిపించకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో తప్పకుండా దాని ప్రభావం మన శరీరంపై పడుతుంది. ఒక్కోసారి శరీరం స్లీప్​ మోడ్​లో ఉన్నా బ్రెయిన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్​ గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో మాత్రం ఎఫెక్ట్‌ పడుతుంది. దీనిని అధిగమించాలంటే తాజా ఆహారం, పరిశుభ్రమైన నీరు, కాస్మోటిక్స్‌ వాడకంపై జాగ్రత్తతో పాటు ఒత్తిడిని జయించేలా జీవనశైలిని మార్చుకోవాలి.

First Published:  21 Feb 2024 5:11 AM GMT
Next Story