Telugu Global
Health & Life Style

ఈ ఫుడ్స్ అతిగా తింటే జుట్టు రాలడం గ్యారంటీ..

ప్రతి ఒక్కరూ ఒత్తైన జుట్టును కోరుకుంటారు. ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలినప్పుడు దానిని కంట్రోల్ చేసేందుకు షాంపూలు మార్చడం, కొత్త కొత్త నూనెలు రాయడం, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తుంటారు.

ఈ ఫుడ్స్ అతిగా తింటే జుట్టు రాలడం గ్యారంటీ..
X

ప్రతి ఒక్కరూ ఒత్తైన జుట్టును కోరుకుంటారు. ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలినప్పుడు దానిని కంట్రోల్ చేసేందుకు షాంపూలు మార్చడం, కొత్త కొత్త నూనెలు రాయడం, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తుంటారు.

జుట్టుకి కేవలం బయటి నుంచే కాదు.. లోపలి నుంచి కూడా బలం రావాలంటే హెల్దీ డైట్ మెంటెయిన్ చేయాలి. అందుకు ఏమి తినాలో కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా.. జుట్టు రాలే సమస్య ఎదురవుతుందని నిపుణులు అంటున్నారు. . కొన్ని పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, పోషకాల లోపం, ఇన్ఫ్లమేషన్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి జుట్టు రాలడానికి కారణం అవుతాయి. సో ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం రండి .

తినకూడని వాటిలో ముందుగా చెప్పుకొనేది జంక్ ఫుడ్ . దీని వల్ల బాడీలోని హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. జిడ్డు ఎక్కువగా ఉత్పత్తి అయి జుట్టు జిడ్డుగా మారి కుదుళ్ళు బలహీనమవుతాయి. అలాగే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతుంది, ఇది హెయిర్‌ గ్రోత్ సైకిల్‌కు అంతరాయం కలిగిస్తుంది. తద్వారా హెయిర్‌ ఫాల్ ఎక్కువగా ఉంటుంది.

అలాగే ఫ్రైడ్‌ ఫుడ్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును పెంచుతాయి. జుట్టు రాలడానికి కారణం అవుతాయి. ఇక డైట్ సోడా, కూల్‌ డ్రింక్స్‌లో లోనూ ఆర్టిఫీషియల్ స్వీటెనర్ ఉంటుంది.

ఇది జుట్టు కుదుళ్ళని బలహీనపరుస్తుంది. కెరాటిన్ ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గడమే కాకుండా బలహీనమవుతుంది. అలాగే బయోటిన్ కూడా జుట్టు పెరుగుడాలకి సహాయ పడుతుంది. పచ్చిగుడ్డులోని తెల్లసొన బయోటిన్ లోపానికి కారణమవుతుంది. వీటితో పాటూ ప్రాసెస్ చేసిన మాంసం, అధిక కెఫిన్‌ కూడా జుట్టుకు చెడే చేస్తాయి. కాబటీ ఈ పదార్ధాలను పరిమితికి మించి తీసుకోకపోవటమే మంచిది.

First Published:  25 Feb 2024 9:52 AM GMT
Next Story