Telugu Global
Health & Life Style

బరువు తగ్గించే పారా బాయిల్డ్ రైస్ గురించి తెలుసా?

వైట్ రైస్ తింటే బరువు పెరుగుతామన్న భయం ఉందా? అయితే పాక్షికంగా ఉడికించిన పారా బాయిల్డ్ రైస్ తీసుకోమంటున్నారు న్యుట్రిషనిస్టులు. వీటిని ‘ఉప్పుడు బియ్యం’ అని కూడా అంటారు.

బరువు తగ్గించే పారా బాయిల్డ్ రైస్ గురించి తెలుసా?
X

బరువు తగ్గించే పారా బాయిల్డ్ రైస్ గురించి తెలుసా?

వైట్ రైస్ తింటే బరువు పెరుగుతామన్న భయం ఉందా? అయితే పాక్షికంగా ఉడికించిన పారా బాయిల్డ్ రైస్ తీసుకోమంటున్నారు న్యుట్రిషనిస్టులు. వీటిని ‘ఉప్పుడు బియ్యం’ అని కూడా అంటారు. వీటిని తీసుకోవడం వల్ల లాభాలేంటంటే..

పారా బాయిల్డ్ రైస్ అంటే ముందే స్టీమ్ చేసి ఆరబెట్టిన బియ్యం. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వీటి వాడకం ఎక్కువ. అయితే ఇప్పుడు మనదేశంలో కూడా వీటి వాడకం పెరుగుతోంది. ఈ బియ్యాన్ని ధాన్యంపై ఉండే పొట్టు తీయ‌కుండా ముందుగానే ఉడికిస్తారు. వాటిలో ఉండే స్టార్చ్.. జెల్ లాగా మారే వ‌ర‌కు ఆవిరిపైనే ఉడికిస్తారు ఇలా ఉడికించి, ఆరబెట్టడంతో గింజల్లోని తేమ పోయి పోషకాలు పెరుగుతాయి. ఈ బియ్యం లేత గోధుమ రంగులో ఉంటాయి. మామూలు అన్నం కంటే మెత్తగా ఉంటుంది.

ఉప్పుడు బియ్యంతో వండిన అన్నంలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అర కిలో పారా బాయిల్డ్ రైస్ లో 776 క్యాలరీల శక్తి, 164 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 20 గ్రాములు ప్రొటీన్లు, 4 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. వీటిలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్టలో హెల్దీ బ్యాక్టీరియాని పెంచుతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

సాధార‌ణ బియ్యంతో పోలిస్తే ఇందులో థ‌యామిన్, నియాసిన్ వంటి పోష‌కాలు కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. అంతేకాదు షుగర్ పేషెంట్లకు ఈ రైస్ మంచి ఆప్షన్. పారా బాయిల్డ్ రైస్ తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ రైస్ తక్కువ గ్లైస‌మిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటుంది. ఉప్పుడు బియ్యంతో శరీరానికి కావల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. డైట్ లో వీటిని చేర్చుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. తెల్ల బియ్యంతో పోలిస్తే వీటిలో ‘బీ కాంప్లెక్స్’ విట‌మిన్స్ కూడా ఎక్కువే. బ్రౌన్ రైస్ తినలేని వాళ్లకు ఇవి మంచి ఆల్టర్నేటివ్.

First Published:  29 Sep 2023 9:45 AM GMT
Next Story