Telugu Global
Health & Life Style

గ్రీన్ కాఫీ గురించి తెలుసా?

గ్రీన్ టీ గురించి మనందరికీ తెలుసు. కానీ, గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? మామూలు కాఫీతో పోలిస్తే గ్రీన్ కాఫీ మరింత రుచికరంగా ఉండడంతో పాటు మరింత ఎక్కువ మేలు చేస్తుందట.

గ్రీన్ కాఫీ గురించి తెలుసా?
X

గ్రీన్ కాఫీ గురించి తెలుసా?

గ్రీన్ టీ గురించి మనందరికీ తెలుసు. కానీ, గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? మామూలు కాఫీతో పోలిస్తే గ్రీన్ కాఫీ మరింత రుచికరంగా ఉండడంతో పాటు మరింత ఎక్కువ మేలు చేస్తుందట. అదెలాగంటే..

సాధారణంగా పచ్చి కాఫీ గింజలు ఆకుపచ్చరంగులో ఉంటాయి. వాటిని రోస్ట్‌ చేస్తే బ్రౌన్ కలర్‌‌లోకి మారతాయి. వాటి నుంచి తీసిన పొడినే మనం కాఫీ పౌడర్‌‌గా వాడుకుంటాం. అలాకాకుండా పచ్చిగా ఉన్న గింజలతో కాఫీ చేస్తే దాన్నే గ్రీన్‌ కాఫీ అంటారు. గింజలను వేగించినప్పుడు వాటిలో కొన్ని ఔషధ గుణాలు నశిస్తాయి. అందుకే మామూలు కాఫీతో పోలిస్తే దీంతో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ.

రెగ్యులర్ కాఫీతో పోలిస్తే గ్రీన్‌ కాఫీ రుచి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో క్లోరోజెనిక్‌ యాసిడ్ ఎక్కువ శాతం, కెఫిన్‌ తక్కువ శాతం ఉంటుంది. కెఫిన్ తక్కువ ఉండడం వల్ల ఇది కాఫీ కంటే సేఫ్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

గ్రీన్‌ కాఫీతో ఉండే బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఇందులో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. శరీరంలోని అదనపు కొవ్వుని కరిగించి ఒబెసిటీని తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీ రోజూ తాగడం ద్వారా హార్ట్ రేట్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా కార్టిసాల్‌ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గ్రీన్‌ కాఫీ తాగడం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. గ్రీన్‌ కాఫీతో కార్డియోవాస్కులర్ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

First Published:  19 Nov 2023 8:30 AM GMT
Next Story