Telugu Global
Health & Life Style

దంతాలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇలా చేయాలి!

ముఖ్యంగా కూరగాయలు, ఫ్రూట్స్‌లో ఉండే నేచురల్ ఫైబర్‌ పళ్లలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాయగూరలు, పండ్లలో ఉండే విటమిన్లు, యాసిడ్లు దంత‌, చిగుళ్ల బలోపేతానికి సాయపడతాయి.

దంతాలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇలా చేయాలి!
X

ఆహారాన్ని బాగా నమిలి తినాలన్నా, ముఖం అందంగా కనిపించాలన్నా.. దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండడం ముఖ్యం. అయితే చాలా కారణాల వల్ల కొంతమందికి పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్లు వాచిపోవడం వంటి సమస్యలు త‌లెత్తుంటాయి. మరి దంత‌, చిగుళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

దంతాలు, చిగుళ్లను కాపాడుకోవడం కోసం ముందుగా టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అలాగే ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు మానుకోవాలి. స్మోకింగ్ వల్ల చిగుళ్లు బలహీన పడడమే కాకుండా నల్లటి రంగులోకి మారతాయి. కాబట్టి దంత‌, చిగుళ్ల ఆరోగ్యం కోసం ఈ అలవాట్లు తగ్గించుకోవాలి. అలాగే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిముల బారి నుంచి దంతాల‌ను ర‌క్షించుకోవ‌డానికి సున్నితమైన బ్రష్‌తో ప్ర‌తి రోజూ ప‌ళ్ల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి.

దంత‌, చిగుళ్ల ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా కూరగాయలు, ఫ్రూట్స్‌లో ఉండే నేచురల్ ఫైబర్‌ పళ్లలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాయగూరలు, పండ్లలో ఉండే విటమిన్లు, యాసిడ్లు దంత‌, చిగుళ్ల బలోపేతానికి సాయపడతాయి. మాంసాహారం ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల పళ్ల మధ్యలో బ్యాక్టీరియా మరింత పేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పుచ్చుపళ్లు, చిగుళ్ల సమస్యలు ఉన్నవాళ్లు మాంసాహారాన్ని తగ్గించడం మంచిది.

ఇకపోతే పాలు, పెరుగు, చీజ్‌ వంటి పదార్థాల్లో ఉండే కాల్షియం, పోస్పరస్‌లు.. దంత‌, చిగుళ్లు బలంగా ఉండేందుకు మేలు చేస్తాయి. చేపల్లో ఉండే ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌.. చిగుళ్లు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. మెగ్నీషియం ఎక్కువగా ఉండే నట్స్ తీసుకోవడం వల్ల దంతాలు ఎక్కువకాలం పాడవ్వకుండా ఉంటాయి.

వీటితో పాటు ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించడం, తరచుగా నీటిని తాగుతుండడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అయ్యి నోటిని శుభ్రంగా ఉండేలా చూస్తుంది. దంత‌, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువకాలం వేధిస్తుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.

First Published:  21 Sep 2023 6:30 AM GMT
Next Story