Telugu Global
Health & Life Style

ఎండలో తిరిగివచ్చిన వెంటనే ఈ పనులు చేయకండి, చాలా డేంజర్..

ఇంకొంత మంది మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు.

ఎండలో తిరిగివచ్చిన వెంటనే ఈ పనులు చేయకండి, చాలా డేంజర్..
X

సమ్మర్‌ అప్పుడే హీటెక్కిస్తోంది. వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 10 దాటితే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. ఇంక బయటకు వెళ్ళేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఆఫీస్ కు వెళ్ళి వచ్చేవారికి ట్రాఫిక్, సమస్య, దారిలో ఉక్కపోత .. కానీ ఏదన్నా పనిమీద బయటకు వెళి వచ్చేవారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వేడిని తట్టుకోలేక మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

మండే ఎండలో బయటకు వెళ్లినప్పుడు దాహాన్ని ని తీర్చుకునేందుకు చాలా మంది రోడ్లపై విక్రయించే రకరకాల జ్యూస్‌లు, నిమ్మరసం, సోడ వంటి చల్లటి పానీయాలు తాగుతుంటారు. మరికొంత మంది కొబ్బరి బోండాలు, చెరుకు రసం వంటివి తీసుకుంటారు. అయితే కొబ్బరి బోండాలు మినహా ఇతర జ్యూస్‌లు, చల్లటి పానియాలు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. . ఒక పక్క ఎండల తీవ్రతతో శరీరం నిర్జలీకరణకు గురవుతుండగా, మరో పక్క కలుషిత పానియాలు తీసుకోవడం వల్ల డయేరియాకు గురై, తీవ్ర అనారోగ్యం బారినపడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇంకొంత మంది మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు. ఎండలో తిరిగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రతను గది ఉష్ణోగ్రతకు తీసుకువచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. లేదంటే గుండెల్లో మంట , గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు కాళ్ళు కూడా అతి చల్లని నీటితో కడుక్కోకూడదు అని చెబుతున్నారు. ఇక ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లని నీరు కూడా త్రాగకూడదని, అలా త్రాగితే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరిగిన వారు కనీసం 5నుంచి 10నిమిషాలు నీడలో సేద తీరిన తరువాత స్వచ్ఛమైన నీరు, సాధారణ ఉష్ణోగ్రతతో ఉన్నది తాగాలి.

First Published:  14 May 2024 3:38 AM GMT
Next Story