Telugu Global
Health & Life Style

భయపెడుతున్న వైరస్ ఎక్స్! లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్ ఎక్స్/ డిసీజ్ ఎక్స్ అంటున్నారు.

భయపెడుతున్న వైరస్ ఎక్స్! లక్షణాలు ఎలా ఉంటాయంటే..
X

కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్ ఎక్స్/ డిసీజ్ ఎక్స్ అంటున్నారు. ఇదెలా ఉంటుందంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ‘డిసీజ్ ఎక్స్’ అనేది కోవిడ్ కంటే పది రెట్లు ప్రమాదకరమైనది. ఇది అత్యంత వేగంగా సోకడమే కాకుండా ప్రాణాతకం కూడా. అందుకే డిసీజ్ ఎక్స్‌ను కోవిడ్, ఎబోలా, జికా వంటి ప్రమాదకరమైన మహమ్మారుల లిస్ట్‌లో చేర్చారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయి. వ్యాక్సిన్‌లు కూడా డెవలప్ చేస్తున్నారు.

డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు వంటి పలు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి. దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఊహాజనిత వ్యాధి. దీనికారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి. ఇదొక కొత్తరకమైన రోగకారక జీవి. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లుగతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. వీటికి సంబంధించి 25 వైరస్‌ కుటుంబాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఏదైనా వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

డిసీజ్ ఎక్స్‌లో జ్వరం, కండరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, కళ్ల వాపు, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కనుక వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  20 Jan 2024 11:23 AM GMT
Next Story