Telugu Global
Health & Life Style

డయాబెటిస్ పేషెంట్లు ఇవి మర్చిపోవద్దు!

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. సరైన లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో మాత్రమే దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలం. డయాబెటిస్ పేషెంట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ పేషెంట్లు ఇవి మర్చిపోవద్దు!
X

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. సరైన లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో మాత్రమే దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలం. డయాబెటిస్ పేషెంట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు తప్పక గుర్తు పెట్టుకోవాల్సి విషయాలేంటంటే...

డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు రోజూ షుగర్ లెవల్స్‌ను పరిశీలిస్తూ ఉండాలి. ఆహార నియమాలు, వ్యాయామం, మందులు వేసుకోవడం, బరువును అదుపులో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటేనే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

డయాబెటిస్ పేషెంట్లు అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ వల్ల కూడా గుండె పోటు, పక్షవాతం లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాట్ ఫుడ్స్, ఉప్పు తగ్గించాలి.

డయాబెటిస్ పేషెంట్లు స్మోకింగ్ అలవాటును మానుకోకపోతే రక్తప్రసరణ మరింత తగ్గుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, పుండ్లు ఏర్పడతాయి. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి.

డయాబెటిస్ పేషెంట్లు నోటి ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలి. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. రోజుకి రెండు సార్లు పళ్లు తోముకోవాలి. అప్పుడప్పుడు దంత పరీక్షలు చేయించుకోవాలి.

డయాబెటిస్ పేషెంట్లకు పాదాలపై బొబ్బలు లేదా పుండ్లు ఏర్పడినప్పుడు తప్పకుండా చికిత్స చేసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్‌ఫెక్షన్ మరింత ముదిరి పాదాలు లేదా వేళ్లు తీసివేయాల్సి రావొచ్చు. అందుకే గాయాలైనప్పుడు గోరు వెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. వేళ్ల మధ్య తడిలేకుండా తుడుచుకోవాలి. డాక్టర్‌‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.

ఇకపోతే డయాబెటిస్ పేషెంట్లు ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. ఒత్తిడి తగ్గించుకోవటానికి ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి చేయాలి. రోజుకు ఏడు గంటలు కంటి నిండా నిద్రపోవాలి.

డయాబెటిస్ పేషెంట్లు రెండు, మూడు నెలలకోసారైనా డాక్టర్లను కలిసి టెస్ట్‌లు చేయించుకోవాలి. కిడ్నీలు, గుండె, కళ్ల పనితీరు, రక్త పోటు లాంటివి చెక్ చేసుకోవాలి.

First Published:  15 Dec 2022 8:55 PM GMT
Next Story