Telugu Global
Health & Life Style

పెరుగుతున్న డెంగ్యూ కేసులు! జాగ్రత్తలు ఇలా..

వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్ జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో డెంగ్యూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.

పెరుగుతున్న డెంగ్యూ కేసులు! జాగ్రత్తలు ఇలా..
X

వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్ జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో డెంగ్యూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వైరల్ ఫీవర్స్‌లో డెంగ్యూ అత్యంత ప్రమాదకరమైనది. లక్షణాలు స్పష్టంగా కనిపించకపోగా లోలోపలే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతూ సమస్య మరింత ముదురుతుంటుంది. కాబట్టి దీనిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

సింప్టమ్స్ ఇలా..

వర్షాకాలంలో డెంగ్యూ ఎక్కువగా వస్తుంటుంది. ఇది సోకినప్పుడు అలసటగా అనిపిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. మెల్లగా జ్వరం మొదలవుతుంది. అయితే కొంతమందికి లక్షణాలు లేకుండా కూడా డెంగ్యూ సోకవచ్చు. కాబట్టి కొద్దిపాటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం అవ్వాలి.

జాగ్రత్తలు ఇలా..

ఈ సీజన్‌లో ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునేటప్పుడు దోమ తెరలు వాడాలి. తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీటి గుంటలు, తడి చెత్త లేకుండా చూసుకోవాలి. శరీరానికి వేప నూనె లేదా లవంగం నూనె వంటివి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి.

శరీరంలో ఇమ్యూనిటీ పెరిగేలా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. కాచి చల్లార్చిన నీటిని ఎక్కువగా తాగుతుండాలి. డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్‌‌ను సంప్రదించాలి.

First Published:  7 Aug 2024 2:30 AM GMT
Next Story