Telugu Global
Health & Life Style

నీళ్ళకి బదులు కూల్ డ్రింకా ? అది ఎంత పెద్ద పొరపాటో తెలుసా మీకు?

బాగా దాహం వేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు మంచినీళ్ళ కంటే కూల్‌డ్రింక్స్‌ కొనటానికే ప్రాధాన్యత ఇస్తాం.

నీళ్ళకి బదులు కూల్ డ్రింకా ? అది ఎంత పెద్ద పొరపాటో తెలుసా మీకు?
X

బాగా దాహం వేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు మంచినీళ్ళ కంటే కూల్‌డ్రింక్స్‌ కొనటానికే ప్రాధాన్యత ఇస్తాం. మీరు నేను ఎవరైనా అదే పని చేస్తాం. నీళ్ళు ఇంట్లో అయినా తాగుతాం కూల్ డ్రింక్స్ బయట ఉన్నప్పుడు తాగుదాం అనే టైపే చాలామంది. అయితే తాజా పండ్ల రసాలకు శీతల పానియాలు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయాన్ని ఏకంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) స్పష్టం చేసింది.

భారత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం విస్తృతమైన పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, శాస్త్రీయ అధ్యయనం తర్వాత ఐసీఎమ్​ఆర్ నూతన ఆహార మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అటు ఎన్​ఐఎన్​ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం కార్బోనేటేడ్ పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్‌ ఉన్నట్లు వెల్లడైంది.ఇది దంతాల్లోని ఎనామెల్ దెబ్బతీస్తుంది, ఆకలి కూడా తగ్గిస్తుంది. శీతల పానీయాలు, కేన్డ్ కొబ్బరి నీరు, సోడా వంటి పానీయాలకు ప్రత్యామ్నాయంగా మజ్జిగ, లేత కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు తీసుకోవాలని సూచించింది.

స్నేహితులతో టైం పాస్ కోసం.. తిన్నది అరిగించుకోవడం కోసం తాగే శీతల పానియాల వల్ల రక్తపోటు, షుగర్‌, బరువు పెరగటం మాత్రమే కాదు సోడా పానీయాలు కాలేయం, క్యాన్సర్‎తో పాటు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్నిసార్లు పిజ్జా, బిర్యానీ, బర్గర్లతో శీతల పానీయాలు విచ్చలవిడిగా తాగేస్తూ ఉంటాం. ఇవి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. శీతల పానీయాల్లో కార్బోనేటేడ్, ఆల్కహాలిక్ పానీయాలు ఉంటాయి. ఇందులోని చక్కెర, కృత్రిమ స్వీటెనింగ్ ఏజెంట్లు, ఆమ్లాలు ఉంటాయి. తాజా పండ్ల రసాలతో పోలిస్తే, వాణిజ్యపరంగా లభించే చాలా పండ్ల రసాల్లో వివిధ రకాల పండ్ల గుజ్జు కూడా 7 శాతం తక్కువగా ఉంటుంది.

వేడి వాతావరణంలో తీవ్రమైన శారీరక శ్రమ చేస్తున్నప్పుడు నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఇలాంటి సమయంలో నీరు ఎక్కువగా తాగాలని, ఆరోగ్యవంతమైన వ్యక్తి పానీయాలతో పాటు రోజుకు సుమారు రెండు లీటర్ల నీరు తాగాలని ఎన్​ఐఎన్​ మార్గదర్శకాలు సూచించాయి. కాఫీ టీలు తగ్గించి , చక్కెర వేయకుండా తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

First Published:  24 May 2024 9:46 AM GMT
Next Story