Telugu Global
Health & Life Style

కాఫీ ఇలా చేస్తే హెల్దీగా ఉండొచ్చు!

కాఫీ తయారుచేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాఫీతో కలిగే దుష్ర్పభావాలను తగ్గించుకొని, మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు.

కాఫీ ఇలా చేస్తే హెల్దీగా ఉండొచ్చు!
X

కప్పు కాఫీ తాగనిదే రోజు మొదలవ్వదు చాలామందికి. కాఫీ ఆరోగ్యానికి అంత మంచిదికాదని తెలిసినా కాఫీని మానడం అంత ఈజీ కాదు. పని ఒత్తిడి, తలనొప్పి లాంటివి తగ్గించుకోడానికి ఓ కాఫీ సిప్ వేయాల్సిందే. అయితే కాఫీ తయారుచేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాఫీతో కలిగే దుష్ర్పభావాలను తగ్గించుకొని, మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగంటే..

కాఫీ చేసుకోవడం కోసం ఇన్‌స్టంట్ పౌడర్ కొనేబదులు నాణ్యమైన కాఫీ గింజలను వాడి ఫిల్టర్ కాఫీ చేసుకోవడం వల్ల రసాయనాల ఎఫెక్ట్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే చక్కెర లేకుండా కాఫీ తాగడం వల్ల అదనపు క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే ఏదైనా తిన్న తర్వాత కాఫీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి.

కాఫీ తయారుచేసేటప్పుడు చిటికెడు యాలకుల పొడిని కలపడం వల్ల కాఫీకి మంచి ఫ్లేవర్ రావడంతో పాటు కాఫీ వల్ల కలిగే ఎసిడిటీని తగ్గించవచ్చు. అలాగే కాఫీలో దాల్చిన చెక్క వేస్తే రుచి మరింత పెరగడంతోపాటు డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

కాఫీలో ఉండే కెఫీన్‌ శరీరంలోని వాటర్ లెవల్స్‌ను తగ్గింస్తుంది . కాబట్టి కాఫీ తాగిన పది నిమిషాల తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

సాయంత్రం, రాత్రి వేళల్లో కాఫీ తాగకపోవడమే బెటర్. ఎందుకంటే కెఫీన్ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిద్రపట్టకుండా చేస్తుంది. అలాగే స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్ తిన్న తర్వాత కాఫీ తీసుకోకూడదు.

కాఫీ పైన క్రీమ్ వాడేవాళ్లు ఫ్రక్టోజ్, ట్రాన్స్‌ఫ్యాట్ తక్కువ మోతాదులోఉన్న క్రీమ్‌ మాత్రమే ఎంచుకోవాలి.

కాఫీ తాగడాన్ని ఆస్వాదించాలంటే ప్రశాంతంగా కూర్చొని... నెమ్మదిగా సిప్‌ చేస్తూ తాగాలి. అప్పుడే రిలాక్సేషన్ దొరుకుతుంది. ఉరుకులు పరుగుల మధ్యలో కాఫీ తాగడం వల్ల ఉపయోగం ఉండదు.

జీర్ణ సమస్యలున్న వాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, యాంగ్జైటీ, డిప్రెషన్‌ సమస్యలున్న వారు కాఫీ తాగకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే పిల్లలకు కూడా కాఫీ ఇవ్వకూడదు. కాఫీ తాగే పిల్లలతో పోలిస్తే తాగని పిల్లల్లలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని స్టడీల్లో తేలింది.

First Published:  4 Nov 2022 10:27 AM GMT
Next Story