Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో సైనస్ సమస్యలు ఎక్కువ! ఈ జాగ్రత్తలు మస్ట్!

వేసవిలో ఉండే ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది.

సమ్మర్‌‌లో సైనస్ సమస్యలు ఎక్కువ! ఈ జాగ్రత్తలు మస్ట్!
X

సమ్మర్‌‌లో ఆరోగ్యం అనగానే అందరూ ఆహారం, తాగే నీళ్ల గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కానీ, దానితోపాటు పీల్చుకునే గాలి మీద కూడా శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, వేసవిలో మరింత త్వరగా వ్యాపిస్తాయి అంటున్నారు.

వేసవిలో ఉండే ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది. శరీరంలో ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్‌ పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి.. అక్కడ్నుంచి రక్తంలోకి చేరుకొని.. హిమోగ్లోబిన్‌తో జతకట్టి అన్నికణాలకు చేరుతుంది. కాబట్టి గాలి ద్వారా వేగంగా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతుంటాయి.

ఈ సమస్యలు ఎక్కువ

ఎండాకాలం ఆస్తమా సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. పైగా ఈ సీజన్‌లో పొడిగాలి ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం స్థాయి కూడా పెరుగుతుంది. వీటి కారణంగా ఆస్తమా రోగులకు ఈ సీజన్ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. కాబట్టి ఎండకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

సమ్మర్‌‌లో వాహనాల నుంచి వెలువడే రసాయనాలు, దుమ్ము, ధూళి వంటివి శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు పొడిదగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పొల్యూషన్, డస్ట్ కారణంగా పలు రకాల ఎలర్జీలు కూడా వేధించొచ్చు.

ఇకపోతే ఎండాకాలం గాలి ప్రభావం వల్ల కళ్ల మంటలు, దురద, కంటి నుంచి నీరు రావటం వంటి సమస్యలు కూడా తలెత్తొచ్చు. వేడి గాలిలోని దుమ్ము , ధూళి కారణంగా కళ్లు లేదా ముక్కులో అలర్జీలు రావొచ్చు. కొంతమందిలో ఇది సైనసైటిస్‌ ప్రాబ్లమ్‌కు దారి తీస్తుంది. కాబట్టి సమ్మర్ సీజన్‌లో వేడి గాలికి నేరుగా ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్తపడడం మంచిది.

మన శరీరానికి అవసరమైన శక్తి ఆక్సిజన్‌ నుంచే లభిస్తుంది కాబట్టి దుమ్ము, ధూళి ద్వారా ఆక్సిజన్ సరిగా అందకపోతే అలసట, నిస్సత్తువ, చిరాకు వంటివి వేధిస్తాయి. కొందరిలో ఇది ఒత్తిడికి సైతం దారితీయొచ్చు. కాబట్టి శ్వాస సామర్ధ్యాన్ని పెంపొందించుకునేలా కార్డియో వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేయడం మంచిది.

జాగ్రత్తలు ఇలా..

సమ్మర్‌‌లో డస్ట్ ఎలర్జీల వంటివి రాకూడందంటే బయటకు వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవటం తప్పనిసరి. వీలైతే నాసల్‌ ఫిల్టర్లు ధరించటం ఇంకా ఉత్తమం.

సమ్మర్‌‌లో పొల్యూషన్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే పలు రకాల శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి. పొగ తాగే అలవాటుని మానుకోవాలి.

శ్వాస ద్వారా వచ్చే సమస్యలు కేవలం బయట మాత్రమే కాదు. ఇంట్లో వాడుకునే వస్తువుల నుంచి కూడా వస్తాయి. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి.

First Published:  21 March 2024 5:00 AM GMT
Next Story