Telugu Global
Health & Life Style

బ్లడ్ గ్రూప్ డైట్! ఎలా పాటించాలంటే...

Blood Type Diet: రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ అనే నాలుగు బ్లడ్‌గ్రూప్స్‌ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే బ్లడ్ గ్రూప్‌ను బట్టి రక్తంలో యాసిడ్స్ ఉత్పత్తి మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Blood Type Diet
X

బ్లడ్ గ్రూప్ డైట్! ఎలా పాటించాలంటే...

రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ అనే నాలుగు బ్లడ్‌గ్రూప్స్‌ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే బ్లడ్ గ్రూప్‌ను బట్టి రక్తంలో యాసిడ్స్ ఉత్పత్తి మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహరం తీసుకోవడం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు రాకుండా కొంత జాగ్రత్తపడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఏయే బ్లడ్ గ్రూప్‌ల వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ గ్రూప్‌: 'ఏ' బ్లడ్ గ్రూప్ వాళ్లకి డయాబెటిస్, ఒబెసిటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే ఆమ్లాలు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. అందుకే వీళ్లు ఫైబర్ ఫుడ్స్ తినాలి . ముడిబియ్యం, గోధుమలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పాలు, మాంసం తక్కువగా తీసుకోవాలి.

బీ గ్రూప్‌: 'బీ' బ్లడ్ గ్రూప్ వారిలో కార్టిసాల్‌ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్లకు కూడా డయాబెటిస్, ఒబెసిటీ రిస్క్ ఎక్కువ. అందుకే వీళ్లు ప్రొటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి కూడా తగ్గించాలి.

ఏబీ గ్రూప్‌: 'ఏబీ' బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారికి జీర్ణాశయంలో ఆమ్లాలు తక్కువగా రిలీజ్ అవుతాయి. కాబట్టి వీళ్లలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువ. అందుకే వీళ్లు తేలిగ్గా అరిగే ఆహారాలు తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

ఓ గ్రూప్‌: 'ఓ' బ్లడ్ గ్రూప్ వాళ్ల పొట్టలో ఆల్కలీన్లు, ఫాస్ఫటేస్‌, లిపోప్రొటీన్‌ లాంటి ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్‌ ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే వీళ్లు యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్‌ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. బేక్డ్ ఫుడ్స్, వేగించిన పదార్థాలు తగ్గించాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి.

First Published:  24 Dec 2022 6:15 AM GMT
Next Story