Telugu Global
Health & Life Style

ఆరోగ్యమైన జుట్టు, చర్మం కావాలంటే బయోటిన్ గురించి తెలుసుకోవాల్సిందే..

చర్మంలో మెరుపుకు, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ పాత్ర ప్రత్యేకమైనది. మన శరీరంలో జీవక్రియలు సరిగా ఉండాలంటే అందుకు తగిన కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అందాలి.

ఆరోగ్యమైన జుట్టు, చర్మం కావాలంటే బయోటిన్ గురించి తెలుసుకోవాల్సిందే..
X

ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే శరీరాన్ని సరైన పోషకాలను అందించటం చాలా అవసరం. ఈ పోషకాలు మనం తినే ఆహారం ద్వారా లభిస్తాయి. అందుకే మన అందం, ఆరోగ్యం కూడా ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలలో బయోటిన్ ఒకటి, ఇది B-కాంప్లెక్స్ విటమిన్లలో ఇది ఒక విటమిన్. చర్మంలో మెరుపుకు, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ పాత్ర ప్రత్యేకమైనది. మన శరీరంలో జీవక్రియలు సరిగా ఉండాలంటే అందుకు తగిన కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అందాలి. ఈ బాధ్యతను తీసుకునేదే బయోటిన్‌. విటమిన్ B7 అని కూడా పిలిచే బయోటిన్ ఈ పోషకం చర్మ కణాలను అభివృద్ధి చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


రోజువారిగా తీసుకునే ఆహారంలో బయోటిన్-రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల చర్మం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం టాబ్లెట్‌ల మొదలు, పౌడర్‌ల వరకు, మార్కెట్ మొత్తం బయోటిన్ సప్లిమెంట్‌లతో సందడి చేస్తోంది. అయితే వీలైనంత వరకు శరీరానికి సరైన ఆహారం అందించడం ద్వారానే నిజమైన అందం సొంతమౌతుంది. చర్మం లోపల నుండి ప్రారంభమయ్యే సహజమైన, ప్రకాశవంతమైన మార్పు కోసం బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ బయోటిన్ రిచ్ ఫుడ్స్ లో మొదటి స్థానంలో ఉండే పదార్ధాలు ఏంటంటే.



1. బాదం: బాదం పలుకులు బయోటిన్ పోషకానికి అద్భుతమైన మూలం. ఈ గింజల్లో చర్మానికి పోషణ అందించే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.అలాగే విటమిన్ ఇ కూడా. ఉంటుంది, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించే సామర్ధ్యం కలిగి ఉంది.

2. గుడ్లు: గుడ్లలో బి విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లు తినాలి. ముఖ్యంగా పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా గుడ్డు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, యవ్వనంగా కనిపిస్తుంది.

3. చిలగడదుంపలు: చిలగడదుంపలలో బయోటిన్‌తో కూడిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ దుంప కూరగాయలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ కూడా ఉన్నాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి.

4. సాల్మన్ చేప: సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి శరీరంలో నొప్పులు, మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సుమారు 100 గ్రాముల సాల్మన్ తింటే 6 mcg బయోటిన్ లభిస్తుంది.


బయోటిన్ అధికంగా ఉండే ఈ ఆహారాలు ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించటానికి సహాయపడతాయి. అయితే, మంచి చర్మ ఆరోగ్యానికి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అవసరమని అవసరమని గుర్తుంచుకోవాలి.

First Published:  16 March 2024 1:36 PM GMT
Next Story