Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో పిల్లలకు వచ్చే వ్యాధులతో జాగ్రత్త!

సమ్మర్ ఎఫెక్ట్ పెద్దవాళ్ల కంటే పిల్లలపై ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో పిల్లలకు కామెర్లు, తట్టు(ర్యూబెల్లా), ఆటలమ్మ(చికెన్ పాక్స్) వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.

సమ్మర్‌‌లో పిల్లలకు వచ్చే వ్యాధులతో జాగ్రత్త!
X

సమ్మర్ ఎఫెక్ట్ పెద్దవాళ్ల కంటే పిల్లలపై ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో పిల్లలకు కామెర్లు, తట్టు(ర్యూబెల్లా), ఆటలమ్మ(చికెన్ పాక్స్) వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వీటికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.

సమ్మర్‌‌లో ఇమ్యూనిటీ లోపించడం, వైరస్‌ల బారిన పడడం వంటి కారణాల చేత పిల్లల్లో ఈ రకమైన వ్యాధులు సోకుతుంటాయి. ఇవి ఒకరికి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. కాబట్టి వీటి విషయంలో పేరెంట్స్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

రుబెల్లా అనే వైరస్ కారణంగా సమ్మర్ సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరంతో కూడిన తట్టు వ్యాధి సోకుతుంది. ఇది సోకినప్పుడు పిల్లలకు ఒళ్లంతా ఎర్రటి దద్దులు వస్తాయి. ఇది అంటువ్యాధి కాబట్టి సోకిన వారిని ఏకాంతంగా ఉంచాలి. ఎక్కువగా బెడ్ రెస్ట్ ఇవ్వాలి. క్లినిక్‌కు తీసుకువెళ్లి లేదా డాక్టర్‌‌నే ఇంటికి పిలిపించి వైద్యం చేయించాలి. చిన్న పిల్లలకు రోజూ స్నానం చేయించడం, ఉతికిన బట్టలు వేయడం వంటి శుభ్రతలు పాటించడం ద్వారా ఈ రకమైన వైరస్ సోకకుండా జాగ్రత్తపడొచ్చు.

సమ్మర్‌‌లో పిల్లలకు వచ్చే మరో వ్యాధి చికెన్ పాక్స్(ఆటలమ్మ). ఇది వెరియోలా అనే వైరస్ వల్ల వస్తుంది. శరరీంపై చిన్నచిన్న నీటి పొక్కులు వస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఇది సోకినప్పుడు వెంటనే డాక్టర్‌‌కు చూపించి మందులు వాడాలి. పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వాలి. అలాగే చిన్నపిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్స్ వేయించాలి.

సమ్మర్‌‌లో నీటి శుభ్రత పాటించకపోయినా, పిల్లలకు సరైన ఆహారం ఇవ్వకపోయినా కామెర్ల వ్యాధి వస్తుంటుంది. కామెర్లు వచ్చినప్పుడు జ్వరం, వాంతులు, మూత్రం పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కామెర్లు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేపించాలి. ఇంట్లో తగిన శుభ్రత పాటించడం, పిల్లల చేత నీళ్లు తాగించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే కామెర్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

సమ్మర్ సీజన్‌లో పిల్లలకు వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే వారికి రోజుకి రెండు సార్లు స్నానం చేయించాలి. నీళ్లు, పండ్లు వంటివి ఎక్కువగా ఇస్తుండాలి. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ సీజన్‌లో పిల్లలకు నూనె పదార్థాలు, చికెన్, మటన్ వంటివి ఎక్కువగా పెట్టకూడదు. పిల్లలకు చెమట పట్టకుండా వదులైన దుస్తులు వేయాలి. జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించి మెడిసిన్ తీసుకోవాలి. అలాగే పిల్లలకు తప్పకుండా తగిన వ్యాక్సిన్స్ వేయించాలి.

First Published:  4 April 2024 6:12 AM GMT
Next Story