Telugu Global
Health & Life Style

బ్యాలెన్సింగ్ కోసం బెస్ట్ వర్కవుట్లు!

రోజువారీ జీవితంలో మెట్లు ఎక్కడం, దిగడం, నడవడం, బరువులు ఎత్తడం, బైక్ నడపడం, బస్‌లో నిల్చోవడం ఇలా రోజూ ఎన్నో రకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ సరిగ్గా చేయాలంటే శరీరంలో బ్యాలెన్సింగ్ కరెక్ట్‌గా ఉండాలి.

బ్యాలెన్సింగ్ కోసం బెస్ట్ వర్కవుట్లు!
X

బ్యాలెన్సింగ్ కోసం బెస్ట్ వర్కవుట్లు!

రోజువారీ జీవితంలో మెట్లు ఎక్కడం, దిగడం, నడవడం, బరువులు ఎత్తడం, బైక్ నడపడం, బస్‌లో నిల్చోవడం ఇలా రోజూ ఎన్నో రకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ సరిగ్గా చేయాలంటే శరీరంలో బ్యాలెన్సింగ్ కరెక్ట్‌గా ఉండాలి. అందుకే వ్యాయామంలో బ్యాలెన్సింగ్ వ్యాయామాలు కూడా చేర్చితే.. శరీరం మరింత బ్యాలెన్స్డ్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

బ్యాలెన్సింగ్ వ్యాయామాలు మెదడుకి శరీరానికి కో–ఆర్డినేషన్‌ను పెంచుతాయి. శరీరం ఫ్రీగా మూవ్ అవ్వడానికి, నిలకడగా ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అందరూ ఈజీగా ఇంట్లో చేసుకోదగ్గ బ్యాలెన్సింగ్ వ్యాయామాలు ఏంటంటే..

స్ట్రైట్ లెగ్ రైజ్

స్టైట్ లెగ్ రైజ్‌ను నేలమీద నిల్చొని చేయాలి. నిటారుగా నిల్చొని, చేతులు తల వెనుక ఉంచాలి. తర్వాత అప్పర్ బాడీ ముందుకు వంచకుండా ఒక కాలుని కొంత ఎత్తుకి లేపి హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేసేటప్పుడు మోకాలు బెండ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇలా పది నుంచి ఇరవై సెకన్ల పాటు హోల్డ్ చేయాలి. తర్వాత రెండో కాలుతో వ్యాయామాన్ని రిపీట్ చేయాలి. ఈ వ్యాయామం వల్ల కాళ్లు బలంగా, ఫ్లెక్సిబుల్‌గా తయారవుతాయి. తొడ భాగం స్ట్రెచ్ అయ్యి, కాళ్లు మరింత బ్యాలెన్స్డ్‌గా పనిచేస్తాయి.

సింగిల్ లెగ్ హాప్

ఈ వ్యాయామం కూడా నేలమీదే చేయాలి. ముందుగా నిటారుగా నిల్చొని, శరీరాన్ని కాస్త ముందుకి వంచాలి. రెండు చేతులు కుడిపక్కకి పెట్టి కుడికాలుపై నిల్చోవాలి. తర్వాత జంప్ చేసి రెండో కాలిపై నిల్చోవాలి. ఇలా కాళ్లు, చేతులు మారుస్తూ ఈ వ్యాయామాన్ని చేయాలి. ఇలా ఈ వ్యాయామాన్ని పది నుంచి ఇరవై సెకన్ల పాటు చేయొచ్చు. దీని వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది. బాడీ బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్ అవుతుంది.

టూ పాయింట్ ప్లాంక్

టూ పాయింట్ ప్లాంక్‌లో ముందుగా నేలపై ప్లాంక్ పొజిషన్‌లో ఉండి.. కుడి చేతిని, ఎడమ కాలిని గాల్లోకి లేపాలి. ఈ పొజిషన్‌లో మోకాళ్లు , మోచేతులు బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలా ఈ పొజిషన్‌లో రెండు సెకన్లు ఉండి.. వెంటనే కుడి కాలు, ఎడమ చేతిని గాల్లోకి లేపాలి. ఇలా కాళ్లు, చేతులు మారుస్తూ ఈ వ్యాయామాన్ని పది నుంచి ఇరవై సెకన్ల పాటు చేయాలి. దీనివల్ల కోర్ మజిల్స్ బలపడతాయి. టోటల్ బాడీ బ్యాలెన్సింగ్ పెరుగుతుంది.

జంప్ హీల్ టచ్

జంప్ హీల్ టచ్ కాస్త కష్టమైన వర్కవుట్. ఈ వ్యాయామంలో ముందు నిటారుగా నిల్చొని గాల్లోకి జంప్ చేయాలి. ఇలా జంప్ చేసినప్పుడు గాల్లో కుడికాలు పాదాన్ని ఎడమ చేత్తో టచ్ చేయాలి. వెంటనే నెక్స్ట్ జంప్‌లో ఎడమ కాలు పాదాన్ని కుడి చేత్తో టచ్ చేయాలి. ఇలా ఈ వ్యాయామాన్ని పది నుంచి ఇరవై సెకన్ల పాటు చేయొచ్చు. దీని వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది. టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. కాళ్లు, చేతుల్లో బ్యాలెన్సింగ్ పెరిగి స్ట్రెచ్ అవుతాయి.

లాభాలివే..

బ్యాలెన్సింగ్ వ్యాయామాలు స్టెబిలిటీని పెంచుతాయి. శరీరం కదలికలు వేగవంతం అయ్యి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

రోజువారీ పనులు సులభంగా చేసుకోడానికి బ్యాలెన్సింగ్ వ్యాయామాలు బాగా పనికొస్తాయి.

బ్యాలెన్సింగ్ వ్యాయామాలతో మెదడు పనితీరు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాడీకణాల సమతుల్యత, ఏకాగ్రత మెరుగవుతాయి.

ఆటలు ఆడే వాళ్లు, మౌంటెన్ క్లైంబింగ్, ట్రెకింగ్ చేసేవాళ్లు బ్యాలెన్సింగ్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి.

బ్యాలెన్సింగ్ వ్యాయామాలు కోర్ మజిల్స్‌ను గట్టిపరుస్తాయి. లోవర్ బ్యాక్, కాళ్లు, లోవర్ బాడీని ఫ్లెక్సిబుల్‌గా మారుస్తాయి.

బ్యాలెన్సింగ్ ఎక్సర్‌‌సైజులు.. చేసే టైం, ఎఫర్ట్‌ను బట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాయి.

ఈ వ్యాయామాలు చేసేకొద్ది ఈజీగా అనిపిస్తాయి. శరీరంలో మార్పు వెంటనే తెలుస్తుంది.

బ్యాలెన్సింగ్ వ్యాయామాలు సింగిల్‌గా చేయడం కన్నా గ్రూప్‌గా చేస్తే మరింత సరదాగా ఉంటుంది.

ఈ వ్యాయామాలకు ఇలాగే చేయాలన్న రూల్ ఉండదు. మనకు తగినట్టుగా వ్యాయామాన్ని కంఫర్టబుల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

వయసుపైబడిన వాళ్లకు బ్యాలెన్సింగ్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని ఎలాంటి ఎక్విప్ మెంట్ అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.

పక్షవాతం, నరాల సమస్యలు, నడిచేటప్పుడు తూలినట్టు, తడబడ్డట్టు అనిపించడం లాంటి సమస్యలున్నవాళ్లకు ఈ వ్యాయామాలు బాగా పనికొస్తాయి.

First Published:  8 Aug 2023 5:30 AM GMT
Next Story