Telugu Global
Health & Life Style

సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలుసా..?

Myositis Disease Symptoms in Telugu: మయోసైటిస్ విషయానికొస్తే.. ఈ వ్యాధి సోకితే కండరాలు వాటంతట అవే బలహీనంగా తయారవుతాయి. కండరాల వాపు, నొప్పులు లాంటివి వస్తాయి. ఏ పనిచేసినా వెంటనే అలసిపోతారు. చిన్నచిన్న వస్తువులు, కొద్దిపాటి బరువులు మోయడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది.

సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలుసా..?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. చాలామంది టాలీవుడ్ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని ట్వీట్లు కూడా పెట్టారు. దాంతో మయోసైటిస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంటీ మయోసైటిస్..? ఈ వ్యాధి ఎందుకొస్తుంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి అని డాక్టర్లు చెప్తున్నారు. ఇది లక్షలో నలుగురి నుంచి 20 మందికి మాత్రమే సోకే అవకాశముంది. ఇదొక ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇలాంటి డిజార్డర్స్‌లో శరీరం తానంతట అది కోలుకోవడమే తప్ప వైద్యపరమైన ట్రీట్మెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రాణాంతకమైన జబ్బుగా డాక్టర్లు పరిగణిస్తుంటారు.

మయోసైటిస్ విషయానికొస్తే.. ఈ వ్యాధి సోకితే కండరాలు వాటంతట అవే బలహీనంగా తయారవుతాయి. కండరాల వాపు, నొప్పులు లాంటివి వస్తాయి. ఏ పనిచేసినా వెంటనే అలసిపోతారు. చిన్నచిన్న వస్తువులు, కొద్దిపాటి బరువులు మోయడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది.

ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌‌లు రావడానికి ప్రత్యేకించి ఎలాంటి కారణాలు ఉండవు. అందుకే వీటిని అరుదైన వ్యాధులుగా భావిస్తారు. ఈ జబ్బున పడినవారికి శరీరం ఇమ్యూనిటీని పెంచుకునేలా ట్రీట్మెంట్ చేస్తారు. ఫిజికల్ థెరపీ, హీట్ థెరపీ, వ్యాయామంతో కూడా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించొచ్చు. సరిపడా విశ్రాంతి తీసుకుంటూ, కొన్ని స్టెరాయిడ్స్ తీసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి. శరీరం సరిగ్గా రెస్పాండ్ అవుతూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంటే పేషెంట్లు కోలుకునే అవకాశం ఉంటుంది. సమంత విషయానికొస్తే.. తాను త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు.

First Published:  2 Nov 2022 3:08 AM GMT
Next Story