Telugu Global
Health & Life Style

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఇలా ఉండాలి!

శరీర మెటబాలిజం యాక్టివ్‌గా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. అయితే బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే అన్ని లాభాలు.

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఇలా ఉండాలి!
X

శరీర మెటబాలిజం యాక్టివ్‌గా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. అయితే బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే అన్ని లాభాలు. కాబట్టి ఉదయాన్నే తీసుకునే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజులో మొదటిసారి తీసుకునే ఆహారం ఆ రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో స్కి్ప్ చేయకూడదు. అలాగే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. దీనికోసం గుడ్డు, నానబెట్టిన నట్స్, మెలకెత్తిన గింజలు, పెసరట్టు, ఇడ్లీ వంటివి తీసుకోవచ్చు. అలాగే బఠానీలతో చేసిన కూర, కొబ్బరి చట్నీ, వేరుశెనగల చట్నీ.. వంటివి కూడా టిఫిన్‌లో మిక్స్‌ చేసుకోవచ్చు.

ఇక బ్రేక్​ఫాస్ట్​లో తీసుకునే కార్బోహైడ్రేట్స్​ విషయంలో హై క్యాలరీలు ఇచ్చే కార్బ్స్‌కు బదులు డైటరీ ఫైబర్ ఉండే ఓట్స్, గోధుమలు, మిల్లెట్స్ వంటివి తీసుకోవాలి. వీటిని ప్రొటీన్స్‌తో కలిపి తింటే బ్రేక్‌ఫాస్ట్ బ్యాలెన్స్‌డ్ గా ఉంటుంది. ఉదయాన్నే ఫ్రూట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలనుకునేవాళ్లు ఫ్రూట్స్‌తో పాటు ఫైబర్, ప్రొటీన్స్ కూడా ఉండేలా చూసుకుంటే మంచిది. కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడం వల్ల వెంటనే ఆకలి వేస్తుంది. కాబట్టి ఉదయపు ఆహారంలో ఫైబర్, ప్రొటీన్ కీలకం.

శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యా్ట్స్‌ను కూడా ఉదయాన్నే తీసుకోవడం బెటర్. నట్స్, నెయ్యి వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో మిక్స్ చేస్తే శరీరానికి కావాల్సిన ఫ్యాట్స్ అందుతాయి. అయితే చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను రెడీ చేసే టైం లేక బ్రెడ్ జామ్, బ్రెడ్ బట్టర్ వంటివి తింటుంటారు. వీటివల్ల ఫైబర్ లభించకపోగా క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే బేక్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.

ఇకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు సూట్ అయ్యే మరో బెస్ట్ ఆప్షన్ సలాడ్స్. ఆకుకూరలు, క్యారెట్, నట్స్, ఉడికించిన పప్పులతో సలాడ్ మిక్స్ చేసుకుని తింటే అన్ని పోషకాలు సమంగా అందుతాయి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటుగా హెర్బల్ టీ లేదా ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగడం కూడా మేలు చేస్తుంది. టిఫిన్‌తో పాటు వీటిని కూడా యాడ్ చేసుకోవడం ద్వారా విటమిన్స్, మినరల్స్ కూడా అందేలా చూసుకోవచ్చు.

First Published:  6 April 2024 1:00 AM GMT
Next Story