Telugu Global
Editor's Choice

రామోజీరావు.... పిచ్చి పీక్స్‌కి?

టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘా పనులను దక్కించుకోవటంలో తప్పేమిటో అర్థంకావటంలేదు. పోలవరం కాంట్రాక్టు పనులలో నవయుగను కూడా టెండర్ల వేయమంటే అప్పట్లో వేయనేలేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘా టెండర్ తక్కువకే కోట్ చేసింది. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్టులను అప్పగించింది.

రామోజీరావు.... పిచ్చి పీక్స్‌కి?
X

పాపం ఎల్లో మీడియా ఏడుపు రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘మళ్ళీ మేఘాకే’ అనే బ్యానర్ స్టోరీలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కే పోలవరంలో మరో కాంట్రాక్టు దక్కిందని రాసింది. మేఘాకే కాంట్రాక్టు పనులు దక్కుతాయని అందరు ఊహించిందేనట. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేఘాకు రూ.4623 కోట్ల పనులు దక్కాయట. అన్నింటిలోనూ పోటీ నామమాత్రమే అని ఎల్లో మీడియా భోరుమన్నది. రివర్స్ టెండరింగ్‌లో లోయస్ట్ 1గా టెండర్లు వేసి మేఘా పనులు దక్కించుకుంటుంటే ఎల్లో మీడియాకు ఏడుపు ఎందుకో అర్థంకావటంలేదు.

చంద్రబాబు నాయుడు హయాంలో నవయుగ కంపెనీకి చాలా పనులే దక్కాయి. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుతో పాటు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా చంద్రబాబు కట్టబెట్టేశారు. అదికూడా నామినేషన్ మీదనే. జగన్ సీఎం అయిన తర్వాత మేఘా కంపెనీ మిగిలిన కంపెనీలతో పోటీపడి తక్కువ రేట్‌కు కోట్ చేసి పనులను దక్కించుకుంటోంది. మరి చంద్రబాబు హయాంలో నవయుగ నామినేషన్ మీదనే చాలా పనులు దక్కించుకున్నది కదా. ఈ ఏడుపు అప్పుడెందుకు ఏడవలేదు?

ఎందుకు ఏడవలేదంటే.. నవయుగ కంపెనీ రామోజీరావు కొడుకు వియ్యంకుడి సంస్థే కాబట్టి. తమవాళ్ళకి నామినేషన్ మీదొచ్చినా రామోజీకి తప్పుగా అనిపించదు. అదే మిగిలిన కంపెనీలతో మేఘా పోటీపడి టెండర్లు దక్కించుకుంటే తట్టుకోలేకపోతోంది. మచిలీపట్నం పోర్టు పనులను దక్కించుకున్న నవయుగ ఎంతకాలమైనా అసలు పనులు మొదలుపెట్టకపోయినా ఎల్లో మీడియా ఏ రోజూ ప్రశ్నించలేదు. ఎందుకంటే అది తమవాళ్ళది కాబట్టే.

టెండర్లలో పాల్గొని లెస్ వేసి మేఘా పనులను దక్కించుకోవటంలో తప్పేమిటో అర్థంకావటంలేదు. పోలవరం కాంట్రాక్టు పనులలో నవయుగను కూడా టెండర్ల వేయమంటే అప్పట్లో వేయనేలేదు. దాంతో మిగిలిన కంపెనీలతో పోల్చితే మేఘా టెండర్ తక్కువకే కోట్ చేసింది. అందుకనే ప్రభుత్వం కాంట్రాక్టులను అప్పగించింది. ఇప్పుడు దక్కించుకున్న పని విలువ రూ.1626 కోట్లు. అయితే ఈ విలువ కన్నా ఒక శాతం తక్కువకే పనులు చేస్తామని చెప్పింది కాబట్టే మేఘాకు కాంట్రాక్ట్‌ దక్కింది. మళ్ళీ ఈ విషయాన్ని ఎల్లో మీడియానే రాసింది. ఇక్కడ విషయం ఏమిటంటే నవయుగ కంపెనీకి ఎక్కడా కాంట్రాక్టులు దక్కటంలేదు. అందుకనే అడ్డుగోలు రాతలు రాసేస్తోంది.

First Published:  11 May 2023 6:10 AM GMT
Next Story