Telugu Global
Editor's Choice

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు..బీఆర్‌ఎస్‌తోనే న్యాయం

తెలంగానలో హైడ్రా బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నయి. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నమని.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు మా గుండె ఆపోతుందని హైడ్రా భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు..బీఆర్‌ఎస్‌తోనే న్యాయం
X

రాష్ట్రంలో హైడ్రా బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నయి. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నమని.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు మా గుండె ఆపోతుందని హైడ్రా భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి కరెంట్ బిల్ ఇచ్చి, టాక్స్ కట్టించుకున్నాదని ఎస్బీఐ లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు లోన్లు ఇచ్చిన ఇండ్లు అక్రమం అని కూలగొడ్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలని కన్నీటి పర్యంతం అయినారు. గొంతులోకి అన్నం దిగట్లేదు. టీవీ చూస్తే భయం అయితుంది.. రాజకీయ నాయకులే మమ్మల్ని మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఇవాళ పొద్దున్నుంచే తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు క్యూ కట్టారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని భాధితులు తెలిపారు. ఎప్పుడు కులుస్తారో అని నిద్ర కూడా పోకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారి ఆవేదని తెలిపారు.

నిరంకుశ ఇందిరమ్మ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నయిని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చెరువులో పరిధిలో కట్టుకున్న… పేదల ఇండ్లను… కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే చాలామంది ఇండ్లు కోల్పోయారు. అటు మూసి పరివాహక ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం జరిగింది. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో బాధితులు ఉన్నారు.ఇలాంటి నేపథ్యంలోనే..మాజీ సీఎం కేసిఆర్ ఏ తమకు న్యాయం చేస్తారని బాధితులు నమ్మకం ఉందని బీఆర్‌ఎస్ పార్టీనే అండగా ఉంటుందని వారు తెలిపారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ నుండి తెలంగాణ భవన్ వద్దకు పెద్ద ఎత్తున హైడ్రా మూసీ బాధితులు తరిలి వచ్చారు.

First Published:  28 Sept 2024 4:53 AM GMT
Next Story