Telugu Global
CRIME

వ్య‌భిచార కేంద్రం న‌డుపుతున్న మ‌హిళా ఎస్ఐ త‌ల్లి, త‌మ్ముడు అరెస్ట్‌

ఆమె త‌ల్లి, త‌మ్ముడు ఎంఆర్‌ప‌ల్లి స‌మీపంలోని ధ‌న‌లక్ష్మిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. వారు వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం రావ‌డంతో సోమ‌వారం రాత్రి పోలీసులు వారి వ్య‌భిచార నిర్వ‌హ‌ణ కేంద్రంపై దాడి చేశారు.

వ్య‌భిచార కేంద్రం న‌డుపుతున్న మ‌హిళా ఎస్ఐ త‌ల్లి, త‌మ్ముడు అరెస్ట్‌
X

ఆమె బాధ్యత క‌లిగిన పోలీసు అధికారిగా విధులు నిర్వ‌ర్తిస్తుండ‌గా.. ఆమె త‌ల్లి, త‌మ్ముడు మాత్రం వ్య‌భిచార కేంద్రం నిర్వ‌హిస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సోమ‌వారం రాత్రి దాడి చేయ‌డంతో వారి గుట్టు బ‌య‌ట‌ప‌డింది. నిర్వాహ‌కురాలైన మ‌హిళా ఎస్ఐ త‌ల్లి, త‌మ్ముడితో పాటు మ‌రో విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మ‌రో ఇద్ద‌రు యువ‌తుల‌ను హోమ్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు తిరుప‌తి ముత్యాల‌రెడ్డిప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు.

స‌ద‌రు మ‌హిళా ఎస్ఐకి ఏడాది క్రితం వివాహ‌మైంది. దీంతో ఆమె త‌న భ‌ర్తతో క‌లిసి వేరుగా జీవిస్తోంది. ఆమె త‌ల్లి, త‌మ్ముడు ఎంఆర్‌ప‌ల్లి స‌మీపంలోని ధ‌న‌లక్ష్మిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. వారు వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం రావ‌డంతో సోమ‌వారం రాత్రి పోలీసులు వారి వ్య‌భిచార నిర్వ‌హ‌ణ కేంద్రంపై దాడి చేశారు. ఆ స‌మ‌యంలో వ్య‌భిచార కేంద్రంలో ఇద్ద‌రు యువతులు, ఒక విటుడు ఉండ‌టం గుర్తించారు. వెంట‌నే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌పై కేసు న‌మోదు చేస్తున్న‌ట్టు సీఐ సురేంద్ర‌నాథ్‌రెడ్డి వెల్ల‌డించారు.

First Published:  21 Feb 2023 3:35 AM GMT
Next Story