Telugu Global
CRIME

రెండు విమానాలు ఢీ : ఐదుగురు మృతి

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెళుతున్నారు. కోస్ట్‌గార్డ్‌ విమానంలో బాధితులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.

రెండు విమానాలు ఢీ : ఐదుగురు మృతి
X

రెండు విమానాలు ఢీకొనడంతో ఐదుగురు సిబ్బంది మృతిచెందిన ఘటన మంగళవారం జపాన్‌ రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో జరిగింది. హనేడా విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురూ కోస్టుగార్డు సిబ్బంది. హనేడా విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో.. రన్‌వే క్లియరెన్స్‌ కోసం ఎదురుచూస్తున్న కోస్ట్‌గార్డ్‌ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జేఏఎల్‌ 516 విమానంలోని సిబ్బంది, 379 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కోస్ట్‌గార్డ్‌ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉండగా, ఒకరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.

సాయం చేసేందుకు వెళుతూ.. మృత్యుఒడికి..

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెళుతున్నారు. కోస్ట్‌గార్డ్‌ విమానంలో బాధితులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రమాదానికి గురవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కోస్ట్‌గార్డ్‌ విమానం హనేడా విమానాశ్రయం నుంచి పశ్చిమ జపాన్‌లోని నిజటాకు బయలుదేరాల్సి ఉంది. రన్‌వే క్లియరెన్స్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే జేఏఎల్‌ 516 విమానం ల్యాండ్‌ అయి దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయి. అందులో చిక్కుకున్న విమానం కొంతదూరం వెళ్లి ఆగిన తర్వాత ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు.

First Published:  3 Jan 2024 1:58 AM GMT
Next Story