Telugu Global
CRIME

ప్రాణం తీసిన కుంపటి

రాత్రిపూట కాస్తంత తిని పడుకున్న కుటుంబంలో తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణం తీసిన కుంపటి
X

రాత్రిపూట కాస్తంత తిని పడుకున్న కుటుంబంలో తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.. మిగతా ఇద్దరు పెద్దవారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. సోమవారం రాత్రి మూసుకున్న ఇంటి తలుపులు మంగళవారం సాయంత్రం కావొస్తున్నా తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు తలుపులు కొట్టినా స్పందన రాలేదు. బలవంతంగా తెరచి చూసేసరికి ఎక్కడివారు అక్కడే నిద్రలో ఉన్న మాదిరిగా ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు కానీ, కుటుంబంలో గొడవ జరిగిన సూచనలు కానీ కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన ఇంటి యజమాని పేరు రహీజుద్దీన్ అని పోలీసులు తెలిపారు.

చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా మిగతా ఇద్దరు బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతడి తమ్ముడు చావుబతుకుల్లో ఉన్నారని వివరించారు.

ఆక్సీజన్ అందకపోవడం వల్ల మీరు మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. ఇంట్లో వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటి వల్లే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు.

First Published:  10 Jan 2024 6:34 AM GMT
Next Story