Telugu Global
CRIME

ఫేక్ సర్టిఫికేట్లతో సర్జరీలు.. ఏడుగురి ప్రాణాలు తీసిన నకిలీలు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌లుగురు న‌కిలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్ద‌రు డాక్ట‌ర్లతో పాటూ ఓ మ‌హిళ స‌ర్జ‌న్ , ల్యాబ్ టెక్నీషియ‌న్ కూడా ఉన్నారు.

ఫేక్ సర్టిఫికేట్లతో సర్జరీలు.. ఏడుగురి ప్రాణాలు తీసిన నకిలీలు
X

ఫేక్ సర్టిఫికేట్లతో సర్జరీలు.. ఏడుగురి ప్రాణాలు తీసిన నకిలీలు

ఫేక్ సర్టిఫికేట్లు ఉపయోగించి శస్త్ర చికిత్స చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌లుగురు న‌కిలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్ద‌రు డాక్ట‌ర్లతో పాటూ ఓ మ‌హిళ స‌ర్జ‌న్ , ల్యాబ్ టెక్నీషియ‌న్ కూడా ఉన్నారు. దక్షిణ ఢిల్లీ గ్రేట‌ర్ కైలాశ్ ప్రాంతంలోని ఓ క్లినిక్ లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతితో వీరి వ్యవహారం వెలుగు చూసింది.

2022లో అస్గర్ అలీనిఅగర్వాల్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్ జస్ప్రీత్ అలీని పరిశీలించి తక్షణం ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ సరిగ్గా థియేటర్లోకి వెళ్లేసరికి డాక్టర్ జస్ప్రీత్ స్థానంలో పూజ, మహేంద్ర ఉన్నారు. ఆపరేషన్ తరువాత అలీ తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి.

దీంతో అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్, మరో ముగ్గురు ఫేక్ వైద్యులు అనీ, వారే అలీకి శస్త్రచికిత్స చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. తరువాత గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఇలాంటిదే మ‌రో కేసు జ‌రిగింద‌ని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, డాక్టర్ లు స‌ర్జ‌రీ స‌రిగా చేయ‌క‌పోవ‌డం, ఆస్ప‌త్రిలో నాణ్య‌త‌లేని ప‌రిక‌రాలు ఉపయోగించడం వ‌ల్ల బ్లీడింగ్ అధికంగా జ‌రిగి పేషెంట్ లు మ‌ర‌ణించిన‌ట్లు గుర్తించారు. పూర్తి విచారణ తరువాత ఫిజీషియ‌న్ అయిన డాక్ట‌ర్ అగ‌ర్వాల్ త‌న వ‌ద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్ల‌తో మెడిక‌ల్ స‌ర్జ‌రీలు చేస్తున్న‌ట్లు తేలింది. దీంతో డాక్ట‌ర్ నీర‌జ్ అగ‌ర్వాల్‌, ఆయ‌న భార్య పూజా అగ‌ర్వాల్‌, డాక్ట‌ర్ జ‌స్‌ప్రీత్ సింగ్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియ‌న్ మ‌హేంద్ర సింగ్‌ను అరెస్టు చేశారు.

గ్రేట‌ర్ కైలాశ్ లోని అగర్వాల్ నడుపుతున్న ఈ మెడికల్ సెంటర్ లో 2016 నుంచి 9 మంది రోగులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. ఎలాంటి అర్హత లేకుండా, కనీస వైద్య ప్రోటోకాల్స్ పాటించకుండా చాలామంది రోగులకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేశారని రోగుల బంధువుల ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు నవంబర్ 1 న, నలుగురు వైద్యులను క్లినిక్ ని పరిశీలించడానికి పంపించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వ్యక్తులు అందరూ ఫేక్ ధ్రువపత్రాలు పెట్టి డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు తేలిందని అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి పేర్కొన్నారు. వీరి నుంచి వైద్యుల సంతకాలు ఉన్న 414 ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను, క్లినిక్‌లో నిర్వహించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రక్రియల కోసం రోగుల వివరాలతో ఉన్న రెండు రిజిస్టర్లు, అనేక మందులు, ఇంజెక్షన్‌లని సీజ్ చేశారు. అలాగే అగర్వాల్ ఇంటి నుంచి నుంచి గ‌డువు ముగిసిన స‌ర్జిక‌ల్ బ్లేడ్లు, 47 బ్యాంకుల‌కు చెందిన చెక్ బుక్కులు, 54 ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డు మెషీన్ల‌ను రిక‌వ‌రీ చేశారు.

First Published:  16 Nov 2023 1:16 PM GMT
Next Story