Telugu Global
CRIME

బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని మర్డర్ చేసిన బాలుడు.. కత్తితో 60 పోట్లు పొడిచి తరువాత డాన్స్..

బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ 16 ఏళ్ల బాలుడు తనకు ఎదురుపడిన 17 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. అతడి ఛాతీ, మెడపై ఏకంగా 60 సార్లు కత్తితో దాడి చేశారు.

బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని మర్డర్ చేసిన బాలుడు.. కత్తితో 60 పోట్లు పొడిచి తరువాత డాన్స్..
X

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ 16 ఏళ్ల బాలుడు తనకు ఎదురుపడిన 17 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. అతడి ఛాతీ, మెడపై ఏకంగా 60 సార్లు కత్తితో దాడి చేశారు. ఘటన తర్వాత మృతదేహం దగ్గర డ్యాన్స్ కూడా చేశాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.



ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడైన 17 ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ ప్రాంతంలో తన తల్లితో కలిసి కులీ పని చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా వెళుతుండగా ఓ 16 ఏళ్ల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినడానికి రూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు. అయితే తనవద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆవేశంతో ఆ బాలుడు దాడికి దిగాడు. కొట్టి గొంతు నులిమేయడానికి ప్రయత్నించాడు. అయితే బాధితుడు ఎదురుతిరగటంతో జేబులోంచి కత్తి తీసి విచక్షణా రహితంగా పొడవటం మొదలుపెట్టాడు. మెడ, ఛాతీపై ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 60 సార్లు పొడిచాడు. చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం కొన్నిసార్లు తలని కాలితో తన్ని, తన్ని పరీక్షించాడు. అప్పటికీ శాంతించని నిందితుడు అతని పక్కనే కత్తి చేతిలో ఉండగానే డ్యాన్స్‌ కూడా చేశాడు. తరువాత మళ్ళీ మళ్ళీ పొడిచాడు.. మృతదేహాన్ని ఈడ్చుకు పోయాడు.


స్థానికుల సమాచారం ద్వారా రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడ్ని అప్పటికప్పుడే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. వెల్కమ్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుందని, సీసీటీవీ ఆధారంగా తాము నిందితుడ్ని అరెస్టు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. మైనర్ నిందితుడిని విచారించగా బిర్యానీ తినడం కోసం మృతుడి వద్ద నుంచి రూ.350 దొంగలించినట్టు చెప్పాడన్నారు. ఘటనకు సంబంధించి దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివిగల వీడియో ఫుటేజీ బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే మైనర్ బాలునిపై గతంలోనూ ఓ హత్య కేసు ఉన్నట్టు సమాచారం.


First Published:  23 Nov 2023 11:30 AM GMT
Next Story