Telugu Global
CRIME

రోజుకు రూ.5 కోట్లు దోచేస్తున్నాడు.. - చ‌దివింది ఇంట‌ర్‌.. చేసేది సైబర్ క్రైమ్‌

హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఉండ‌గా ముంబై బాంగూర్‌న‌గ‌ర్ పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. అత‌నితో పాటు అరెస్ట‌యిన‌వారిలో ఇద్ద‌రు ఠాణేకు, మ‌రో ఇద్ద‌రు కోల్‌క‌తాకు చెందిన‌వారు ఉన్నారు.

రోజుకు రూ.5 కోట్లు దోచేస్తున్నాడు.. - చ‌దివింది ఇంట‌ర్‌.. చేసేది సైబర్ క్రైమ్‌
X

మ‌హిళ‌లనే ల‌క్ష్యంగా చేసుకొని కోట్లాది రూపాయ‌లు దోచేస్తున్న సైబ‌ర్ నేరగాడిని ముంబై పోలీసులు బుధ‌వారం హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. అత‌నితో పాటు మ‌రో న‌లుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.50 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. 40 బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు.

నిందితుడు దాడి శ్రీ‌నివాస‌రావు (49) చ‌దివింది ఇంట‌ర్ వ‌ర‌కే.. అయినా సైబ‌ర్ నేరాల్లో ఆరితేరిపోయాడు. రోజుకు రూ.5 కోట్ల మేర‌కు దోపిడీ చేస్తున్నాడంటేనే అది అర్థం చేసుకోవ‌చ్చు. హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఉండ‌గా ముంబై బాంగూర్‌న‌గ‌ర్ పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. అత‌నితో పాటు అరెస్ట‌యిన‌వారిలో ఇద్ద‌రు ఠాణేకు, మ‌రో ఇద్ద‌రు కోల్‌క‌తాకు చెందిన‌వారు ఉన్నారు. నిందితుడు శ్రీ‌నివాస‌రావు ఎవ‌రితో సంప్ర‌దింపులు జ‌రిపినా టెలిగ్రామ్ యాప్ ద్వారానే జ‌రుపుతాడు.

పోలీసుల‌మ‌ని చెబుతూ..

వీరు త‌మ‌ సైబ‌ర్ నేరాల‌కు మ‌హిళ‌ల‌నే టార్గెట్‌గా చేసుకున్నారు. మ‌హిళ‌లకు ఫోన్ చేసి.. తాము పోలీసుల‌మ‌ని చెబుతారు. మ‌హిళ‌లు పంపిన కొరియర్‌లో మాద‌క ద్ర‌వ్యాలు, ఆయుధాలు దొరికాయ‌ని బెదిరిస్తారు. తాము ఎలాంటి కొరియ‌రూ పంపలేద‌ని చెబితే.. ఆ కొరియ‌ర్ మీది కాద‌ని నిరూపించేందుకు బ్యాంకు వివ‌రాలు గాని, ఆదాయ ప‌న్ను వివ‌రాలు గాని పంపించాల‌ని చెబుతారు. ఇదే క్ర‌మంలో ఓటీపీని కూడా తీసుకుంటారు.

ఫోన్‌నే త‌మ కంట్రోల్‌లోకి తీసుకుని..

వీరు ఎనీ డెస్క్ వంటి యాప్ ద్వారా మ‌హిళ‌ల ఫోన్‌ని త‌మ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. ఆ త‌ర్వాత వారి బ్యాంకు ఖాతాల‌ను ఖాళీ చేస్తారు. ఈ విధంగా వారు నిర్వ‌హిస్తున్న బ్యాంకు ఖాతాల్లో రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు లావాదేవీలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

చైనా జాతీయుడి ఖాతాకు బ‌దిలీ..

నిందితుడు దాడి శ్రీ‌నివాసరావు.. దోచుకున్న డ‌బ్బంతా క్రిప్టో క‌రెన్సీగా మార్చేస్తాడు. అనంత‌రం వాటిని చైనాకు చెందిన వ్య‌క్తి ఖాతాకు బ‌దిలీ చేస్తాడు. ఇప్ప‌టికే దేశంలోని వేలాదిమంది వీరి చేతిలో మోస‌పోయారు. ఎట్ట‌కేల‌కు వీరి ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  4 May 2023 3:15 AM GMT
Next Story