Telugu Global
CRIME

పైత్యం పరాకాష్టకు..లిప్ లాక్ ఛాలెంజ్ పేరిట నడిరోడ్డుపై విద్యార్థుల రచ్చ..!

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో యువతీ యువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకుంటున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించిన విద్యార్థులంతా మంగళూరు లోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థులు.

పైత్యం పరాకాష్టకు..లిప్ లాక్ ఛాలెంజ్ పేరిట నడిరోడ్డుపై విద్యార్థుల రచ్చ..!
X

సెన్సేషన్ కోసం కాలేజీ విద్యార్థులు చేసే రచ్చ ఇతరులకు ఇబ్బందిగా మారడం జరుగుతోంది. తమిళనాడులో కొద్ది రోజులుగా కళాశాల విద్యార్థులు బస్ డే, రూట్ తల అనే పేర్లతో ఒక వర్గం పై మరో వర్గం ఆధిపత్యం చూపేందుకు తరచూ గొడవలు పడుతున్నారు. పొడవాటి కత్తులు పట్టుకుని లోకల్ ట్రైన్లలో వారు చేసే హంగామాతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలో కళాశాల విద్యార్థులు లిప్ లాక్ ఛాలెంజ్ పేరుతో నడి రోడ్లపై హంగామా చేస్తున్నారు. యువతీ యువకులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో యువతీ యువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకుంటున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించిన విద్యార్థులంతా మంగళూరు లోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థులు. వీరంతా యూనిఫాం కూడా ధరించారు. నడిరోడ్డుపై ఓ ఇంటి ముందు వీరు నానా రచ్చ చేశారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోటీపడి ముద్దులు పెట్టుకుంటూ ఉండగా.. చుట్టూ నిలబడి ఉన్న విద్యార్థులు వారిని ఎంకరేజ్ చేస్తూ నానా అల్లరి చేశారు. అంతటితో వారు ఆగలేదు. ' దమ్ముంటే మీరు కూడా ఇలా లిప్ లాక్ చేయండి' అని తోటి విద్యార్థులకు సవాల్ విసిరారు.

నడిరోడ్డుపై విద్యార్థులు ఒక చోట చేరి ముద్దులు పెట్టుకోవడం స్థానికులను ఇబ్బందికి గురిచేసింది. అక్కడ నివసించేవారు విద్యార్థులు చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో ముద్దులు పెడుతూ కనిపించిన ఓ విద్యార్థిని గుర్తించి అతడిని అరెస్టు చేశారు. లిప్ లాక్ ఛాలెంజ్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిలు శృతిమించి ప్రవర్తించడంతో ఆ సమయంలో వారు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

First Published:  22 July 2022 4:46 AM GMT
Next Story