మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు
25 టీచర్లు, విద్యార్థులు మృతి?
BY Naveen Kamera1 Oct 2024 11:01 AM GMT
X
Naveen Kamera Updated On: 1 Oct 2024 11:01 AM GMT
బ్యాంకాక్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది చిన్నారులు మృతిచెందినట్టు అనుమానిస్తున్నారు. ఉతాయ్ థాని ప్రావిన్స్ లోని వాట్ ఖావో పాయా స్కూల్ కు చెందిన 38 విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ట్రిప్ కు వెళ్లివస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ బస్సు నుంచి 16 మంది స్టూడెంట్స్, ముగ్గురు టీచర్లను రక్షించారని, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉందని థాయ్ లాండ్ రావాణా శాఖ మంత్రి మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్యపై స్పష్టత లేదని, బస్సులో 44 మంది ప్రయాణిస్తుండగా, 19 మందిని రక్షించగలిగామని తెలిపారు. మిగతా వారి వివరాలు తెలియలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదంలో మృతుల సంఖ్య 25 మంది వరకు ఉండొచ్చని సందేహిస్తున్నారు. బస్సు ప్రమాద మృతులకు థాయ్ లాండ్ ప్రధాని షెంటోగ్టార్న్ షినవత్రా సంతాపం తెలియజేశారు.
Next Story