Telugu Global
MOVIE UPDATES

పుష్ప - 3 కూడా ఉంది : ఫహాద్ ఫాసిల్

ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్తా.. క్లైమ్యాక్స్ వరకు వెళ్లింది అని ఫాసిల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సుకుమార్‌తో మాట్లాడితే పుష్ఫ 3 కూడా ఉండే అవకాశం ఉందన్నాడు

పుష్ప - 3 కూడా ఉంది : ఫహాద్ ఫాసిల్
X

'పార్టీ లేదా పుష్ఫా' అనే ఒకే ఒక్క డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తుండిపోయిన నటుడు ఫహాద్ ఫాసిల్. మలయాళంలో మంచి పేరు, స్టార్‌డమ్ ఉన్న నటుడైన ఫహాద్ ఫాసిల్.. పుష్ప ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఉత్తరాదిన కూడా ఆయనను ఇప్పుడు చాలా మంది గుర్తు పడుతున్నారు. దీనికి కారణం పుష్ఫ పార్ట్ 1 అని చెప్పక తప్పదు.

ఫహాద్ ఫాసిల్ ప్రస్తుతం తాను నటించిన 'మలయన్ కుంజు' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ఫ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తన దగ్గరకు వచ్చి ఒక సీన్ నెరేట్ చేశారు. నేను పోలీస్‌ స్టేషన్‌లో ఉండగా.. పుష్ఫ వచ్చి కలిసే సీన్. అదే ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పారు. అప్పట్లో ఈ సినిమా రెండు భాగాలు ఉంటదని తనకు చెప్పలేదు అని ఫాసిల్ అన్నాడు.

ఎర్ర చందనం వెనుక ఉన్న స్టోరీ జనాలకు పూర్తిగా అర్థం కావాలంటే తప్పకుండా రెండు భాగాలు తీయాలని సుకుమార్ ఆ తర్వాత నాకు చెప్పాడన్నారు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్తా.. క్లైమ్యాక్స్ వరకు వెళ్లింది అని ఫాసిల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సుకుమార్‌తో మాట్లాడితే పుష్ఫ 3 కూడా ఉండే అవకాశం ఉందన్నాడు.

వాస్తవానికి నెట్‌ఫ్లిక్స్ వాళ్ల కోసం సుకుమార్ ఒక వెబ్‌ సిరీస్ తీద్దామని ప్లాన్ చేశాడు. రెడ్ శాండల్ నేపథ్యంలోనే ఆ సిరీస్ సాగుతుంది. కానీ ఆ కథను వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన మానేసి సినిమా తీశాడని ఫహాద్ ఫాసిల్ అసలు గుట్టు విప్పాడు. కాగా, షూటింగ్ సమయంలో తెలుగు డైలాగ్స్ గుర్తుంచుకోవడానికి తనకు కావలసినంత సమయం ఇచ్చాడని.. సుకుమార్, అర్జున్ ఎంతో స్వేచ్ఛ ఇవ్వడంతోనే తాను ఆ సినిమాను ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేశానని ఫహాద్ ఫాసిల్ చెప్పుకొచ్చారు.

First Published:  19 July 2022 12:25 PM GMT
Next Story