Telugu Global
Cinema & Entertainment

మాస్ మహారాజా రూటు మార్చాడు..!

ఇన్నేళ్ల తర్వాత రవితేజ మరోసారి చిరు సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

మాస్ మహారాజా రూటు మార్చాడు..!
X

మాస్ మహారాజా రవితేజకు చిరంజీవి తర్వాత సొంతంగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరోగా పేరు ఉంది. ఆ గుర్తింపు, క్రేజ్ రవితేజకు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. ముందుగా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తర్వాతే హీరోగా మారాడు రవితేజ. సింధూరం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్ సినిమాలు వరుస విజయాలు అందుకోవడంతో రవితేజ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ స్టార్‌డం కాపాడుకోవడానికి రవితేజ ఎంతో కష్టపడ్డాడు.

ఇడియట్ రిలీజ్ అయి సరిగ్గా 20 ఏళ్ల తరువాత రవితేజ ఇప్పుడు మరో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు. హీరో కాకముందు చేసిన ముఖ్య పాత్రల్లో నటించడానికి మళ్ళీ అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా నటించే సినిమాల్లో కీలక పాత్రల్లో నటించేందుకు అంగీకారం తెలిపాడు.

ఇది వరకు చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ చిరు తమ్ముడి పాత్రలో నటించాడు. ఇన్నేళ్ల తర్వాత రవితేజ మరోసారి చిరు సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అఫీసియల్ ప్రకటన కూడా వచ్చింది. త్వరలో మొదలయ్యే షెడ్యూల్ లో రవితేజ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు.

అనిల్ రావిపూడి -బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే బాలయ్య అనిల్ తో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఇందులో ఒక ప్రధాన పాత్రలో రవితేజ నటించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రవితేజకు రాజాదిగ్రేట్ వంటి హిట్ మూవీ ఇచ్చాడు. ఆ చొరవతోనే బాలయ్య సినిమాలో ఒక పాత్రకు రవితేజను అనిల్ ఒప్పించాడని సమాచారం. కథ కూడా నచ్చడంతో రవితేజ పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది. ప్రస్తుతం పలువురు సీనియర్ అగ్ర హీరోలు ఇమేజ్ చట్రాన్ని వీడి డిఫరెంట్ రోల్స్ చేస్తున్న తరుణంలో రవితేజ కూడా ముఖ్య పాత్రల్లో నటించేందుకు ముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది.

First Published:  14 July 2022 9:25 AM GMT
Next Story