Telugu Global
Cinema & Entertainment

NTR | నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరో

NTR - నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరో రెడీ అయ్యాడు. ఇతడి పేరు కూడా ఎన్టీఆర్.

NTR | నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరో
X

తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, పెద్ద ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని "న్యూ టాలెంట్ రోర్స్ " బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

నందమూరి తారక రామారావు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని, హీరోగా ఎదగడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు. తన అద్భుతమైన కెరీర్‌లో ఎందరో నటీనటులను పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి తన కమ్‌బ్యాక్ మూవీతో నందమూరి తారక రామారావును లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నాడు.

డైరెక్టర్ వైవిఎస్ చౌదరికి నందమూరి హీరోలతో గొప్ప అనుబంధం ఉంది. ఆయన హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేశారు. ఇప్పుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు.

First Published:  10 Jun 2024 5:39 PM GMT
Next Story