Telugu Global
Cinema & Entertainment

HIT 2 movie teaser: హిట్-2 టీజర్ పై యూట్యూబ్ వివాదం

Adivi Sesh's HIT 2 movie teaser: అడివి శేష్ హీరోగా నటిస్తున్న హిట్-2 సినిమా టీజర్ పై యూట్యూబ్ కన్నెర్రజేసింది. అందులో అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ, సదరు టీజర్ ను ట్రెండింగ్ నుంచి తొలిగించింది.

HIT 2 movie teaser: హిట్-2 టీజర్ పై యూట్యూబ్ వివాదం
X

అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఫ్రాంచైజీ హిట్-2. శైలేష్ కొలను డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. వెంటనే వైరల్ అయింది. మిలియన్లలో వ్యూస్ కూడా వచ్చాయి. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్ లో యూట్యూబ్ షాక్ ఇచ్చింది.

అవును.. హిట్-2 టీజర్ ను ట్రెండింగ్ లిస్ట్ నుంచి తీసేసింది యూట్యూబ్. అంతేకాదు, ఇకపై ఈ టీజర్ ను ఎవరు పడితే వాళ్లు చూడలేరని కూడా ప్రకటించింది. హిట్-2 టీజర్ చూడాలంటే వయసు నిర్థారణ తప్పనిసరి అని, దాని కోసం యూట్యూబ్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందని తెలిపింది.

ఇలా ఉన్నఫలంగా హిట్-2 టీజర్ పై యూట్యూబ్ ఆంక్షలు విధించడానికి ఓ కారణం ఉంది. ఈ టీజర్ చివరి షాట్ లో ఓ భయంకరమైన సన్నివేశం ఉంది. ఓ యువతి కాళ్లు, చేతులు, తల వేటికవి నరికేసిన సీన్ అది. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్న ఆ సన్నివేశంపై యూట్యూబ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే ట్రెండింగ్ లిస్ట్ నుంచి తొలిగించింది.

దీనిపై హీరో అడివి శేష్ వివరణ కూడా ఇచ్చాడు. ఇలా జరుగుతుందని ఊహించామన్నాడు. యూట్యూబ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, టీజర్ చూడాలనుకుంటే లాగిన్ అవ్వాలని సూచించాడు. ఏదేమైనా యూట్యూబ్ చేసిన ఈ పనితో, హిట్-2 టీజర్ కు వ్యూస్ తగ్గడం ఖాయం. ఎందుకంటే, యూట్యూబ్ వినియోగదారుల్లో దాదాపు 50శాతం మంది లాగిన్ అవ్వరు. చాలామందికి జీమెయిల్ ఎకౌంట్లు కూడా ఉండవు.

First Published:  10 Nov 2022 4:00 AM GMT
Next Story