Telugu Global
Cinema & Entertainment

Prabhas Yogi | ప్రభాస్ నుంచి మరో మూవీ రీ-రిలీజ్

Yogi movie - ప్రభాస్ నటించిన యోగి మూవీ మళ్లీ విడుదలకానుంది. 18వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

Prabhas Yogi | ప్రభాస్ నుంచి మరో మూవీ రీ-రిలీజ్
X

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, నయనతార జంటగా అప్పటి స్టార్‌ డైరెక్టర్‌ వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘యోగి’. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈశ్వరి ఫిలింస్‌ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు, రమణ గోగుల సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ అప్పట్లో పెద్ద హిట్టయ్యాయి.

తాజాగా ఈ చిత్రాన్ని చందు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లింగం యాదవ్‌ రీ-రిలీజ్‌ చేస్తున్నాడు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కె ఫార్మట్‌లోకి మార్చారు. దిల్‌రాజు, శిరీష్‌ల సహకారంతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతోంది యోగి.

ఈ చిత్రం రీ-రిలీజ్‌ టైలర్‌, పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత దర్శకుడు రమణ గోగుల హాజరయ్యాడు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌, పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.

మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది యోగి సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా శారద నటించారు. సినిమాలో సెంటిమెంట్ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ప్రభాస్ నుంచి ఆడియన్స్ ఏదో ఆశిస్తే, సినిమాలో అందుకు భిన్నంగా ఉంది. దీంతో ప్రభాస్ అభిమానుల్ని ఇది నిరాశ పరిచింది. రీ-రిలీజ్ లో ఇది ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

First Published:  13 Aug 2023 2:32 PM GMT
Next Story