Telugu Global
Cinema & Entertainment

సమంత సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న మూవీ యశోద. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

సమంత సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి-హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తారు. సమంత కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇదే.


ప్రమోషన్స్ లో రొటీన్ కి భిన్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్, విడుదల తేదీ పోస్టర్ ని వినూత్నంగా అభిమానులు ద్వారా విడుదల చేశారు. ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉంటాయంట. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయంట. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుందంట.


ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు.


వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

First Published:  17 Oct 2022 12:10 PM GMT
Next Story