Telugu Global
Cinema & Entertainment

Yash | కొత్త సినిమాతో రెడీ అయిన రాకీ భాయ్

Yash - కేజీఎఫ్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు యష్. ఇప్పుడీ హీరో తన కొత్త సినిమాను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాడు.

Yash | కొత్త సినిమాతో రెడీ అయిన రాకీ భాయ్
X

కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు యష్. ఆ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. కె.జి.యఫ్ చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యష్ నెక్స్ట్ సినిమా కోసం ఏడాదిపాటు సైలెంట్‌గా వెయిట్ చేశాడు. యష్ నెక్ట్స్ మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి పెరిగిన నేపథ్యంలో తనపై నమ్మకంతో ఎదురు చూస్తోన్న కోట్లాది మంది అభిమానుల కోసం గుడ్ న్యూస్ అందించాడు ఈ హీరో.

ఎట్టకేలకు సైలెన్స్‌కి బ్రేక్ ఇస్తూ యష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. 8వ తేదీ ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా డీటెయిల్స్ ప్రకటిస్తారు. కెరీర్ లో యష్ కు ఇది 19వ చిత్రం.

కేజీఎఫ్ సినిమాలో రాకీ భాయ్ గా అదరగొట్టాడు యష్. అప్పట్నుంచి అతడిపై పాన్ ఇండియా లెవెల్లో యాక్షన్ ఇమేజ్ పడిపోయింది. ఈ నేపథ్యంలో అతడు తన నెక్ట్స్ సినిమాకు యాక్షన్ స్టోరీనే సెలక్ట్ చేసుకున్నాడా లేక మరో జానర్ ట్రై చేస్తున్నాడా అనే విషయంపై చాలామందికి ఆసక్తి ఉంది. ఆ వివరాలన్నీ మరికొన్ని రోజుల్లో బయటకురాబోతున్నాయి.

First Published:  5 Dec 2023 2:51 PM GMT
Next Story