Telugu Global
Cinema & Entertainment

రీషూట్ చేయలేదు.. కొత్తగా షూట్ చేశాం

Dhamaka Movie: రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా కోసం చాలా రీషూట్స్ చేశారా..? అలాంటిదేం లేదంటున్నాడు రచయిత ప్రసన్న.

రీషూట్ చేయలేదు.. కొత్తగా షూట్ చేశాం
X

మామూలుగానే శరవేగంగా షూటింగ్ చేస్తాడు రవితేజ. ఇలాంటి హీరోతో రీషూట్స్ అంటే చాలా కష్టం. కానీ ధమాకా సినిమాకు సంబంధించి అలాంటి రీషూట్స్ చాలానే జరిగాయనే పుకార్లు గట్టిగా వినిపించాయి. దర్శకుడు త్రినాధరావు నక్కినతో రవితేజ దగ్గరుండి రీషూట్స్ చేయించాడంటూ కథనాలు కూడా వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంపై రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ స్పందించాడు. దర్శకుడు త్రినాధరావుతో కలిసి సెట్స్ లోనే ఉంటూ మేకింగ్ ను దగ్గరుండి చూసుకునే ఈ రైటర్, ధమాకా సినిమాకు సంబంధించి ఎలాంటి రీషూట్స్ చేయలేదని స్పష్టం చేశాడు.

"ఎలాంటి రీషూట్స్ చేయలేదు. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఎంటర్ టైన్ మెంట్ అద్భుతంగా ఉంది. రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు హీరో పాత్రలో ఎగ్రషన్ తగ్గిందనిపించింది. దానికి మ్యాచ్ చేయడానికి మరో ఫైట్ ని షూట్ చేశాం. ఇది సినిమాని బెటర్ చేయడానికి చేసింది తప్పితే రీషూట్ కాదు."

ఇలా ధమాకా రీషూట్ పై స్పందించాడు ప్రసన్నకుమార్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు.




First Published:  10 Dec 2022 11:56 AM GMT
Next Story