Telugu Global
Cinema & Entertainment

విజయ్ కమ్ బ్యాక్ మామూలుగా లేదుగా.. 2 డేస్‌లోనే ఖుషి హాఫ్ సెంచరీ

తొలి రెండు రోజుల్లోనే ఖుషి సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మూడు వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ లభించడంతో అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ కమ్ బ్యాక్ మామూలుగా లేదుగా.. 2 డేస్‌లోనే ఖుషి హాఫ్ సెంచరీ
X

మొదట చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. హీరోగా నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో విజయ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత విజయ్‌కి వరుసగా హ్యాట్రిక్ ప్లాప్‌లు వచ్చాయి. అతడు హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి.

లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ అది తీవ్రంగా నిరాశపరిచింది. అయితే తాజాగా విజయ్ నటించిన ఖుషి సినిమా అతడికి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో భారీ హైప్ మధ్య ఈ మూవీ విడుదల అయింది. తొలిరోజే రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు కూడా రూ.21 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

తొలి రెండు రోజుల్లోనే ఖుషి సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మూడు వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ లభించడంతో అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఓవర్సీస్‌లో కూడా ఖుషి సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్లు అక్కడ వన్ మిలియన్ మార్క్ కు చేరుకున్నాయి. పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో ఖుషి సినిమా తొందర్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


First Published:  3 Sep 2023 11:58 AM GMT
Next Story