Telugu Global
Cinema & Entertainment

సుదీప్ పాన్ ఇండియా స్టార్ అవుతాడా.. రేపే రిజల్ట్

విక్రాంత్ రోణ.. సుదీప్ నటించిన తాజా చిత్రం. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో ఇమేజ్ కోరుకుంటున్నాడు ఈ హీరో.

సుదీప్ పాన్ ఇండియా స్టార్ అవుతాడా.. రేపే రిజల్ట్
X

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'విక్రాంత్ రోణ' రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది. జీ స్టూడియోస్ , సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, కిచ్చా క్రియేషన్ సమర్పణలో జాక్ మంజునాథ్ , శాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో పాటు రారా రక్కమ్మ అనే సాంగ్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది.

అటవీ ప్రాంతంలో ఉండే ఓ ఊరు , అక్కడ ఓ భయంకరమైన కథను దాచాలనుకోవడం దాన్ని చేధించాడానికి భయం లేని విక్రాంత్ రోణ అక్కడికి వెళ్ళడం , అలా వెళ్ళాక తనకు ఎదురైన సంఘటనలేంటి? వాటిని విక్రాంత్ రోణ ఎలా ఎదుర్కున్నాడు? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో యాక్షన్ ఫాంటసీ గా రూపొందిన ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి.

హిందీలో సల్మాన్ ఖాన్ ప్రెజెంట్ చేస్తుండటం అక్కడ టీంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనడంతో బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తెలుగులో అక్కినేని నాగార్జున, విక్రాంత్ రోణ కోసం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు.

భారీ అంచనాల నడుమ రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న 'విక్రాంత్ రోణ' తో కిచ్చా సుదీప్, పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్, సౌత్ సినిమాల్లో నటించడం సుదీప్ కు కొత్త కాదు. కాకపోతే పాన్ ఇండియా హీరో ఇమేజ్ అతడికి రాలేదు. విక్రాంత్ రోణతో ఆ ఇమేజ్ దక్కుతుందని భావిస్తున్నాడు ఈ హీరో. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

First Published:  27 July 2022 8:40 AM GMT
Next Story