Telugu Global
Cinema & Entertainment

RRR Movie - ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ వస్తుందా?

RRR Movie Part 2 - ఆర్ఆర్ఆర్-2 కీలక ప్రకటన చేశాడు రాజమౌళి. ఇంతకీ ఈ సినిమాకు సీక్వెల్ తీసేంత టైమ్ రాజమౌళికి ఉందా?

RRR Movie - ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ వస్తుందా?
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు-నాటు పాట అకాడమీ అవార్డ్ అందుకుంది. ఇప్పుడీ ఉత్సాహంతో సినిమాకు ఏకంగా సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి.

తరచుగా తన తండ్రితో కలిసి కథాచర్చల్లో కూర్చునే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ పార్ట్-2 కూడా తీస్తానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. సీక్వెల్ కు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని కూడా హాలీవుడ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. అయితే అతడు టైమ్ ఫ్రేమ్స్ మాత్రం చెప్పలేదు.

ఆర్ఆర్ఆర్ వ్యవహారాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న రాజమౌళి, త్వరలోనే మహేష్ బాబు హీరోగా సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు జక్కన్న. ఆ సినిమా పూర్తవ్వడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుంది.

ఆ సినిమా రిలీజైన తర్వాత ఆర్ఆర్ఆర్ పార్ట్-2పై ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి కనీసం ఏడాది పడుతుంది. సో.. ఆర్ఆర్ఆర్-2 సెట్స్ పైకి రావాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుందన్నమాట.

మరి ఈ గ్యాప్ లో రాజమౌళి మనసు మారుతుందా.. లేక హాలీవుడ్ మీడియాతో చెప్పినట్టు నిజంగానే పార్ట్-2కు రెడీ అవుతాడా అనేది చూడాలి. రాజమౌళి డిసైడ్ అవ్వాలి కానీ, మరోసారి సీక్వెల్ లో నటించేందుకు చరణ్-తారక్ ఎప్పుడూ సిద్ధమే. ఈ విషయాన్ని వాళ్లు కూడా కన్ ఫర్మ్ చేశారు.

First Published:  15 March 2023 2:45 AM GMT
Next Story