Telugu Global
Cinema & Entertainment

Kalyan Ram: ప్రేక్షకుల్ని నిరాశపరచనంటున్న కల్యాణ్ రామ్

Kalyan Ram's Amigos Movie: బింబిసారతో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్, అమిగోస్ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు.

Kalyan Ram: ప్రేక్షకుల్ని నిరాశపరచనంటున్న కల్యాణ్ రామ్
X

ఈసారి కూడా ప్రేక్షకుల్ని నిరాశపరచనంటున్నాడు హీరో కల్యాణ్ రామ్. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ హీరో, అమిగోస్ తో మరో హిట్ కొడతానని, ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేయనని చెబుతున్నాడు. పనిలోపనిగా స్టోరీలైన్ ను కూడా కాస్త టచ్ చేశాడు

"2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది."

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రేపు ప్లాన్ చేశారు. ఆ ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది బింబిసార సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.



First Published:  4 Feb 2023 7:43 AM GMT
Next Story